తెలంగాణ

ఎన్‌జివో ఏజన్సీలకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: విదేశాల నుంచి నిధులు అందుకుంటున్న స్వచ్చందసేవా సంస్ధలు బ్యాంకుల్లో విదేశీ కాంట్రిబ్యూషన్స్ రిజిస్ట్రేషన్స్ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఏ) కింద చెల్లుబాటయ్యే ప్రత్యేక అకౌంట్లను తెరవకపోవడంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కొరడా ఝుళిపించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని పలు ఎన్‌జివోలకు ప్రత్యేక అకౌంట్లను తెరిచి పర్యవేక్షించకపోవడంపై నోటీసులను జారీ చేసింది. ఎఫ్‌సిఆర్‌ఏ చట్టం కింద విదేశాల నుంచి కాంట్రిబ్యూషన్స్ లేదా నిధులు అందుకుంటున్న ఎన్‌జివో సంస్ధలు బ్యాంకుల్లో ప్రత్యేక అకౌంట్లను తెరవడమే కాకుండా, వీటిని నిత్యం పర్యవేక్షించుకోవాల్సి ఉంటుంది.
బ్యాంకులు కూడా ఈ ఖాతాల్లోకి జమయ్యే నిధులపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రెండు రోజుల్లో సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఖాతాల్లో జమయ్యే నిధులను ఏ మేరకు డ్రా చేశారో వివరాలను ఆర్‌బిఐకు బ్యాంకులు తెలియచేయాలి. అనేక ఎన్‌జివో ఏజన్సీలు కేంద్రం తాఖీదులను పక్కనపెట్టి విదేశీ నిధులు వచ్చే అకౌంట్లను తెరవకపోవడం, ప్రత్యేకంగా పర్యవేక్షించకపోవడం జరుగుతున్నట్లు కేంద్రానికి ఫిర్యాదులు అందాయి.
గత ఏడాది కేంద్రం దేశంలో పలు ఎన్‌జివో ఏజన్సీలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటి లైసెన్సులను రద్దు చేసిన విషయం విదితమే. నిర్దేశించిన ప్రయోజనాలకు కాకుండా వేరే పనులకు హవాలా మార్గం ద్వారా నిధులు తెప్పించుకుని ఖర్చుపెడుతున్నారని కేంద్ర హోంశాఖకు సమాచారం అందినట్లు తెలిసింది. అలాగా వార్షిక రాబడి, ఖర్చు వివరాలతో కూడిన రిటర్న్స్‌ను కూడా ఎన్‌జివో సంస్ధలు దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖ పలుసార్లు ఎన్‌జివోలను కోరింది. గత ఏడాది ఎఫ్‌సిఆర్‌ఏ చట్టాన్ని ఉల్లంఘించిన అభియోగాలపై దాదాపు 20 వేలకు పైగా ఎన్‌జివోల గుర్తింపు, లైసెన్సులను కేంద్రం రద్దుచేసింది. కేంద్రం ఎన్‌జివో సంస్ధల పట్ల అనుసరిస్తున్న కఠిన వైఖరి వల్ల విదేశాల నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్స్ మొత్తం 2013-14లో రూ.13,600 కోట్లు ఉండగా, 2014-15కు రూ.7600 కోట్లకు పడిపోయింది. దేశంలో 10 లక్షలకు పైగా స్వచ్చందసేవా సంస్ధలు ఉన్నాయి. వీటిల్లో 13 లక్షల మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఈ సంస్ధలు అనేక సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఎయిడ్స్, బాలబాలికల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఇంకా కాలుష్య నియంత్రణ, వర్షపు నీటి నిల్వలు, వెట్టి చాకిరీ నుంచి విముక్తి ఇలా లెక్కలేనన్ని సామాజికంగా ఉపయోగపడే పనులు చేస్తున్నాయి. కాని కొన్ని సంస్ధలు మత వ్యాప్తికి పాటుపడుతున్నాయనే అభియోగాలు లేకపోలేదు.