తెలంగాణ

27 నుంచి ఉద్యాన మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: ఈ నెల 27 నుంచి 31 వరకు ఉద్యానమహోత్సవం 2017 నిర్వహిస్తున్నట్లు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ తెలిపింది. ఉద్యాన మహోత్సవం నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై వివిధ కమిటీలు, చైర్మన్లు, సభ్యులతో ఉద్యాన శాఖ కార్యదర్శి సి.పార్థసారథి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉద్యాన శాఖ సంచాలకుడు వెంకటరామ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకటరామ్‌రెడ్డి మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానం, నూతన పంటలు, మొక్కలు, వాటి విశిష్టతను తెలియజేయడానికి ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం శాఖ కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి ఉద్యాన మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉత్సవాలను క్షుణ్ణంగా పరిశీలించి తదనుగుణంగా అన్ని రకాల కార్యక్రమాలను రూపొందించి రైతులకు ఉపయోగపడే విధంగా తీర్చి దిద్దాలని అన్నారు.