తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీని పరిపూర్ణంగా సమాయత్తం చేస్తున్నామని, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణలో 2019 ఎన్నికలు లక్ష్యంగా పెట్టుకుని పార్టీని సమయత్తం చేస్తున్నామని, అసెంబ్లీ క్షేత్రంలో పూర్తి స్థాయి పుల్ టైమర్స్‌ను నియమించి, బూత్ స్థాయిలో కమిటీలు వేశామని, అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా పార్టీ కార్యాలయాన్ని సైతం ఆధునికీకరిస్తున్నామని డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు.
కేంద్రప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడంతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి అనుసంథానం చేస్తామని అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా వాటిని వెచ్చించి ప్రజలకు, రైతులకు సంక్షేమ పథకాలను అమలుచేయలేకపోతోందని, అన్ని పనులూ నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. రైల్వే ప్రాజెక్టుల అమలులో కూడా రాష్ట్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రాజన్ సైతం రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారని అన్నారు. ఐటిఇఆర్ ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకువెళ్లలేకపోయిందని ఆరోపించారు.
జాప్యాన్ని తప్పిపుచ్చడానికి రాష్ట్రం రాజకీయ ఆరోపణలు చేస్తోంది తప్ప కేంద్రంతో కలిసి రావడం లేదని పేర్కొన్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సైతం 2019లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తున్నారని, ప్రజాపోరాటాల ద్వారా ఉద్యమాలు చేస్తూ పార్టీ ని ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దుతామని లక్ష్మణ్ పేర్కొన్నారు.