తెలంగాణ

కౌలు రైతుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: ఇప్పటి వరకు ఉన్న చట్టాలన్నీ వ్యవసాయ భూముల యజమానులకు ఉపయోగపడే విధంగా మాత్రమే ఉన్నందున కౌలు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కొత్త చట్టం తేవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు కేంద్ర వ్యవసాయ భూమి కౌలు హక్కు చట్టం 2016 తరహాలో తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కౌలు హక్కుదారు చట్టం తేవడం ద్వారా నిరుపయోగంగా ఉన్న భూమి సైతం చాలా వరకు ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎపి (తెలంగాణ ప్రాంత) కౌలు హక్కుదారు చట్టం 1950ని సవరించి ఆ స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందుకు అనుగుణంగా కొత్త చట్టం నమూనా రూపకల్పనకు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం సహకారాన్ని తీసుకుంటోంది. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనాలు లేని కౌలు రైతులకు ఉపయోగంగా ఉంటుందని ఆశిస్తున్నారు. పంటరుణాలు, బీమా ప్రయోజనాలన్నీ భూమి యజమానులకు మాత్రమే దక్కేవి. కొత్త చట్టాన్ని అనుసరించి ఎవరైతే పంట వేసి పెంచుతారో వారికే ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు దక్కేవిధంగా నిబంధనలను పొందుపర్చేందుకు అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ.8 వేల ఆర్థిక సహాయం చేసేందుకు ఇప్పటికే నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వారికే ఈ ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం ఉన్నందున ఈ కొత్త కౌలుదారు చట్టానికి అధిక ప్రాధాన్యత ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న కౌలుదారు చట్టం 1950ని అనుసరించి కౌలుదారుగా గుర్తించబడాలంటే అందుకు భూమి యజమాని, కౌలుదారు మధ్య లిఖితపూర్వక ఒప్పందం జరగాల్సి ఉంటుంది. ఆ ఒప్పందం ప్రతిని సంబంధిత ఎమ్మార్వోకి సమర్పించాలి. అప్పుడే కౌలు దారుకు లభించాల్సిన ప్రయోజనాలన్నీ దక్కుతాయి. అయితే చాలా మంది భూ యజమానులు రాతపూర్వక ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఒక వేళ చొరవ చూపించినా ఒక పంట లేదా, రెండు పంటల కాలపరిమితికి తప్ప చట్ట ప్రకారం ప్రయోజనాలు దక్కాలంటే అవసరమైన ఐదేళ్ల సమయానికి రాతపూర్వక ఒప్పందం ఉండాలి. ఆచరణలో ఇదంతా సాధ్యం కానందున కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోంది.
రూపొందించబోయే కొత్త చట్టంలో కౌలు రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే, భూమి యజమాని హక్కులకు భంగం వాటిల్లకుండా భద్రత కల్పించేందుకు అనువుగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టం తాలూకు నమూనా ప్రతిని త్వరలోనే రూపొందించి సిఎం కెసిఆర్ పరిశీలనకు పంపించేందుకు తెలంగాణ రెవెన్యూ శాఖ వేగంగా పని చేస్తోంది.