తెలంగాణ

డ్రగ్స్ కేసులో దూసుకెళుతోన్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు దూసుకెళ్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరశివారులో పట్టుబడ్డ ఇంజనీరింగ్ విద్యార్థి నవ్యంత్ కరీంనగర్ వాసిగా సిట్ అధికారులు గుర్తించారు. డ్రగ్స్ లింకులు హైదరాబాద్‌కే కాదు..పట్టణాలకు పాకాయి. కాగా డ్రగ్స్ కేసులో అరెస్టయిన విద్యార్థి నవ్యంత్ డ్రగ్స్ మాఫియా కెల్విన్ ముఠాలో కీలక వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ మాఫియా అంతుచూడటమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు ముందుకు దూసుకెళ్తున్నారు. విచారణలో కెల్విన్ గ్యాంగ్ ఇచ్చిన సమాచారంతో నైజీరియన్లపై నిఘా పెట్టిన పోలీసులు కీలక విషయాలు తెలుసుకున్నారు. డ్రగ్స్ దందాలో బాధితులుగా మారిన ఇంజనీరింగ్ విద్యార్థులే పెడ్లర్లు, స్మగ్లర్లుగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. పదిహేను రోజుల క్రితం విజయవాడకు చెందిన సంగీత అండ్ గ్యాంగ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు కెల్విన్ ముఠా దందాను రాబట్టారు. ఇందులో కరీంనగర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నవ్యంత్ విషయం బయటపడింది.