తెలంగాణ

ఏడాదిలో దేవాదుల పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: ఏడాది కాలంలో దేవాదుల ప్రాజెక్టు పూర్తవుతుందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం తెలిపారు. మిషన్ కాకతీయను ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా భావించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఇరిగేషన్, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. అంతర్జాతీయ జల వారోత్సవాల్లో మిషన్ కాకతీయ పై ప్రత్యేకంగా చర్చ జరపడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. మిషన్ కాకతీయ మొదటి దశలో మాదిరిగానే రెండవ దశలో ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. మిషన్ కాకతీయ మొదటి దశ విజయానికి కారకులైన ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లను హరీశ్‌రావు అభినందించారు. చెరువు గట్లపై మొక్కల పెంపకంపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. వ్యవసాయ అధికారుల ద్వారా భూసార పరీక్షలు జరపాలని చెప్పారు. మండల స్థాయి అధికారులు, ఆయా మండలాల్లో చెరువులు దత్తత తీసుకోవాలని సూచించారు. ఒక్కో సబ్ డివిజన్‌లో కనీసం ఒక చెరువునైనా దత్తత తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం భూ సేకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. 2017 నాటికి ప్రాజెక్టుల కోసం 45వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని తెలిపారు. భూ సేకరణ సత్వరం జరిపితే కేంద్రం నుంచి వెయ్యి కోట్ల రూపాయలు వస్తాయని అన్నారు. భూ సేకరణ కోసం జివో 123ను అమలు చేయాలని అన్నారు. ప్రధానమంత్రి కృషి సించాయి పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 18వేల కోట్ల నిధులు ఇవ్వనున్నట్టు తెలిపారు. జిల్లాల ఇరిగేషన్ ప్లాన్ సిద్ధం చేసి డిపిఆర్‌లను పంపాలని మంత్రి ఆదేశించారు. మూసీ నది ఆధునీకరణకు సంబంధించిన సర్వే పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. మూసీని ఆధునీకరిస్తే నల్లగొండ జిల్లాలో మరో లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చునని హరీశ్‌రావు తెలిపారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నల్లగొండ కలెక్టర్‌ను హరీశ్‌రావు ఆదేశించారు.

చిత్రం గురువారం సచివాలయంలో అధికారులతో
సమీక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు