తెలంగాణ

వందేళ్ల వర్సిటీ ఉండేది ఇలాగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17 : ఉస్మానియా యూనివర్శిటీ పనితీరుపై తొలి రోజు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ (నేక్) బృందం పెదవి విరిచింది. నేక్ గుర్తింపు కోసం గురువారం ఉదయం యూనివర్శిటీని సందర్శించిన బృందం వర్శిటీలోని వివిధ ఫ్యాకల్టీలను సందర్శించింది. ఈ సందర్భంగా కొన్ని ఫ్యాకల్టీల్లో పనితీరుపై నేక్ బృందం సభ్యులు పెదవివిరిచారు. వందేళ్ల ఘనచరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్శిటీ పనితీరు ఇలా ఉంటే ఎలా అని బృందం సభ్యులు వ్యాఖ్యానించినట్టు సమాచారం. సైన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న యూనివర్శిటీ, సామాజిక శాస్త్రాలు, ఇతర విభాగాల్లో బలహీనంగా ఉందని సభ్యులు పేర్కొన్నట్టు తెలిసింది. బృందం సభ్యులను విద్యార్ధి సంఘాల నాయకులు సైతం కలిసి వర్శిటీ పరిస్థితులను వివరించారు. ఈ బృందం మరో రెండు రోజుల పాటు వర్శిటీలో వివిధ విభాగాలను సందర్శించి యూనివర్శిటీ సమర్పించిన స్వీయ సమీక్షా విధానపత్రంపై అధ్యయనం చేయనుంది. నేక్ బృందానికి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాలరెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం యూనివర్శిటీ ప్రొఫైల్ కాపీలను వారికి అందించారు. ఉస్మానియాకు ఈసారి ఎ ట్రిపుల్ ప్లస్ గ్రేడ్‌ను సాధిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఉస్మానియాలో అధ్యాపకుల కొరత కొంత ఉన్నా, పరిశోధనలు ఆగడం లేదని, త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరించుకుంటామని , రాష్ట్రప్రభుత్వం అందుకు సరిపడా నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. యూనివర్శిటీలో ఖాళీలపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపించామని, రిక్రూట్‌మెంట్‌కు అన్ని చర్యలు చేపట్టిందని విసి వారికి వివరించారు. యూనివర్శిటీ కార్యకలాపాలు అన్నీ ఆన్‌లైన్‌లోనే చేస్తున్నామని, చివరికి దూర విద్యా కోర్సుల ప్రవేశాలను సైతం ఈ ఏడాది నుండి ఆన్‌లైన్‌లో చేపట్టనున్నామని విసి వారికి వివరించారు. నేక్ బృందానికి ప్రొఫెసర్ ఎస్ కె సింగ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మెంబర్ కో ఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ సతీందర్ సింగ్ వ్యవహరిస్తారు. ఈ బృందంలో ప్రొఫెసర్ విజయేందర్ కుమార్, ప్రొఫెసర్ కె జయప్రసాద్, ప్రొఫెసర్ ఎ వి సింగ్ మదనావత్, ప్రొఫెసర్ హెచ్ రాజశేఖర్, ప్రొఫెసర్ డి ఆర్ భాస్కర్, ప్రొఫెసర్ కనిక శర్మ, ప్రొఫెసర్ శైలేంద్ర షరాఫ్ ఉన్నారు.