తెలంగాణ

విద్యుదాఘాతంతో మరణించిన రైతులకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: రాష్ట్రంలో విద్యుత్ ఘాతానికి గురై మరణించిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల నష్ట పరిహారం అందించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన పశువులకు కూడా రూ.60 వేల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. విద్యుత్ స్థంభాలు సరిగ్గా లేకపోవడం వల్ల తరచు తీగలు తెగిపోయి విద్యుత్ ఘాతానికి గురవుతున్నారని ఆయన ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రతి విద్యుత్ స్ధంభానికి, స్థంభానికి మధ్య 60 మీటర్లు దూరం మించి ఉండాలి. కానీ చాలా చోట్ల 100 మీటర్ల దూరం ఉండడం వల్ల విద్యుత్ తీగలు తెగిపోయి ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. ఈ విషయంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం చాలా కనిపిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదనపై దృష్టిపెట్టడం మంచి పరిణామమేనని, అయితే పంపిణీ వ్యవస్ధపై కూడా దృష్టిసారించాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి విద్యుత్ శాఖలోని కింది స్థాయి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొలాల మధ్యలో తీగలు వేలాడుతూ గాలికి తెగిపోయి కిందపడిపోతున్నందున, వాటిని రైతులు చూడకుండా తాకడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయని చాడ తెలిపారు.