తెలంగాణ

శాంతి భద్రతలతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: ఏ దేశమైనా అభివృద్ధి చెందుతూ , ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే శాంతి, భద్రతలవ పరిరక్షణ ఎంతైనా అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజూ అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ఎన్ ఎస్ ఎస్ విభాగం, నెహ్రూ యువ కేంద్ర సంఘటనల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నాడు హైదరాబాద్‌లో జరిగిన జాతీయ భద్రతపై యువ సమ్మేళన కార్యక్రమానికి రిజిజూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ఎంతో కాలం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోకూడదని, దేశం పురోగమించడానికి ఇది సరైన సమయమని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల వయస్సులోపు వారేనని, ఈ కారణంగా సవాళ్లను స్వీకరించి దేశాన్ని ముందుకు నడపడానికి సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి చెప్పారు. వీరు వృద్ధులయ్యేలోపు మన దేశం సంపన్నదేశంగా ఆవిర్భవించాలని ఆయన సూచించారు. సీమాంతర ఉగ్రవాదం, మత్తుమందుల అక్రమ రవాణా, దొంగనోట్లు వంటి వివిధ రకాల సవాళ్లను ఎదుర్కోవడానికి పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉండి తీరాలని ఆయన అన్నారు. ఉగ్రవాదం తదితర ముప్పులను ప్రతి అంతర్జాతీయ వేదిక పైనా సమర్ధంగా ఎదుర్కోవడానికి దేశాలు రహస్య సమాచారాన్ని పంచుకోవలసిన అవసరం ఉందని అన్నారు.
ఒక వ్యక్తి సాధించిన విజయానికి కొలమానంగా డబ్బునో, లేదా పదవినో ఉపయోగించకూడదని ఆయన చెబుతూ అర్ధవంతమైన ఉపాధిని అనే్వషించడంలో యువత సఫలం కావాలని అన్నారు. దేశాభివృద్ధిలో యువత పాలుపంచుకోవాలని సలహా ఇచ్చారు. నిపుణులైన శ్రామికులను తీర్చిదిద్దడానికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఇదేనని చెప్పారు. అభివృద్ధి అన్నింటా సమంగా లేకపోవడం గౌరవ ప్రదమైన జీవన శైలి చాలా తక్కువ మందికి మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితిని కల్పించిందని రిజిజూ చెప్పారు. పౌరులు సంతృప్తికరమలైన అర్ధవంతమైన జీవనం గడపాలని , తద్వారా ఈ పరిస్థితిని తారుమారు చేయాలని ఆయన అన్నారు. కేంద్ర పౌర ప్రధానమైన కార్యక్రమాలను రూపొందిస్తోందని, ప్రతి పౌరుడిని సంతోషంగా ఉంచడమే తమ ఉద్ధేశ్యమని పేర్కొన్నారు. స్వచ్ఛ భారతావని ఆవిష్కరణ కోసం ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు గురించి రిజిజూ ప్రస్తావిస్తూ, ప్రజలు పౌర కర్తవ్య భావనను పెంపొందించుకోవాలని, బాధ్యతా యుతమైన జీవితాలను గడపాలని అన్నారు. మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. అవసరమైపుడల్లా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సత్వర సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అంతకుముందు నెహ్రూ యువక కేంద్ర సంఘటన వైస్ చైర్మన్ పేరాల శేఖరరావు మంత్రికి స్వాగతం పలికారు.

చిత్రం..గురువారం హైదరాబాద్‌లో జాతీయ భద్రతపై జరిగిన యువ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజూ