తెలంగాణ

తెలంగాణ పోలీస్ నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, ఆగస్టు 17: శాంతి భద్రతలను కాపాడడంలో దేశానికే ఆదర్శంగా నిలిచారని, తెలంగాణ పోలీస్ అంటే..నెంబర్ ఒన్‌గా కీర్తి చాటుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. అత్యాధునిక హంగులతో గచ్చిబౌలిలో నిర్మించిన మాదాపూర్ డిసిపి, ఏసిపి, గచ్చిబౌలి పోలీస్ సముదాయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ అభివృద్ధి సాధించాలంటే శాంతి భద్రలు అదుపులో ఉండాలని అప్పుడే, రాష్ట్రంలో, నగరంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తారని చెప్పారు. కంపెనీలు వస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతోపాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పోలీసులకు, అభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంటుందని, పోలీసులు మరింత పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. సీఎం కేసిఆర్ ముందు చూపుతో అధికారం చేపట్టిన వెంటనే పోలీసులకు రూ. 350కోట్లు మంజూరు చేసి నూతన వాహనాలు సమకూర్చడం జరిగిందని తెలిపారు. నూతన పెట్రోలింగ్ విధానంతో నేరాలు తగ్గయాని, దొంగలు తెలంగాణ వైపు చూడడానికి భయపడుతున్నారన్నారు. పెట్రోలింగ్ వాహనాల గస్తీని పరిశీలిస్తే.. అమెరికాతో పోటీ పడుతున్నట్టుగా, రౌడీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్టుగా ఉందని హోంమంత్రి నాయిని చెప్పారు.
గతంలో పోలీసు స్టేషన్‌కు వాహనాలుండేవి కావు..ఉన్న వాహనాలను నలుగురు గెంటాల్సి వచ్చేదని ఆయన గుర్తు చేశారు. పోలీసులకు కావలసిన వౌలిక సదుపాయాలు వసతులు కల్పిస్తున్నామని, అందులో భాగంగానే పోలీసు స్టేషన్‌లను ఆధునీకరించడం జరుగుతుందన్నారు. సొంత భవనాలు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 2 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అందులో భాగంగానే కొన్ని పోలీసు స్టేషన్‌లకు అదనపు గదులు నిర్మిస్తున్నామన్నారు. పాడైపోయిన పాత పోలీస్ క్వాటర్స్‌లను మరమ్మతు చేయించడం, కావలసిన చోట నూతన వసతి గృహలను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు రావడానికి మంత్రి కెటిఆర్ కృషి చేస్తున్నారని, ఇప్పటి వరకు 15వందల కంపెనీలు వచ్చాయని, ఇందులో 50వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం వలన ఎవరైన నేరం చేస్తే సులువుగా గుర్తు పట్టవచ్చని చెప్పారు. గతంలో కెబిఆర్ పార్కు వద్ద జరిగిన కాల్పుల సంఘటనను గుర్తు చేస్తూ, ఆయన పోలీసుల పనితనాన్ని ప్రశంసించారు. సిసి కెమెరాల ఏర్పాటుతో పలు కేసుల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. మహిళలను వేధించే పోకిరీల ఆట కట్టించేందుకు షీ టీమ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని, నగర పాలక సంస్థ పరిధిలో 100 బృందాలు పని చేస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా మరో వంద షీ టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని 30 జిల్లా కేంద్రాల్లో షీ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, ఇబ్బందుల్లో ఉన్న మహిళ కోసం భరోసా, కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 93లక్షల మొక్కలు నాటడం జరిగిందిని తెలిపారు. ఈసందర్భంగా నూతన భవనంలోని డిసిపి, ఏసిపి, గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌ల్లో ఆయన పూజలు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ అవరణలో నాయినితోపాటు పలువురు పోలీస్ అధికారులు మొక్కలు నాటారు.

చిత్రం..గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన పోలీసు స్టేషన్ భవనాన్ని ప్రారంభిస్తున్న హోంమంత్రి నాయిని ఇతర అధికారులు