తెలంగాణ

గోదావరిలో దూకి ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, ఆగస్టు 17: అనె్నంపునె్నం ఎరుగని చిన్నారులతో కలిసి ఓ మహిళ బాసర గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గురువారం కలకలంరేపింది. రోజువారీ విధుల్లో భాగంగా తాగునీటిని సరఫరా చేసే పంప్‌హౌస్‌కు వచ్చిన సిబ్బంది గోదావరి నదిలో తేలియాడుతున్న మృతదేహాలను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కూతురు, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పెల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన అర్చనషిండె (27), ఆమె కూతురు దీక్షిత (6)తోపాటు నాలుగు నెలల వయస్సు గల చిన్నారి కీర్తిరాజ్ మృతి చెందిన వారిలో ఉన్నారు. బాసర గోదావరిపై గల వంతెన పైనుండి పిల్లలను నదిలోకి తోసేవేసి తల్లికూడా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
బర్దిపూర్ గ్రామానికి చెందిన అర్చనషిండెకు 2009లో ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన రాములుతో వివాహం జరిగింది. ఏడేళ్లక్రితం ఉపాధికోసం ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిన రాములు గత ఏడాది కొన్నిరోజులపాటు ఇక్కడికి వచ్చి తిరిగి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయాడు. భర్త తరపు కుటుంబసభ్యులు ఎవరూ లేకపోవడంతో అర్చన తనతల్లిగారి ఊరైన బర్దిపూర్‌లోనే నివాసం ఉంటోంది. ఇటీవల అర్చనకు కొడుకు పుట్టిన తర్వాత తరచూ అనారోగ్యానికి గురవుతుండడంతో మనస్తాపం చెంది ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బుధవారం ఉదయం తనకు అరోగ్యం బాగాలేదని ఇంట్లో చెప్పి పిల్లలతో కలిసి ఇంటినుండి బయలుదేరిన అర్చన నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి బాసరకు చేరుకుని గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, బుధవారం మధ్యాహ్నం నుండి తమ కూతురు, ఆమె పిల్లలు కనిపించడం లేదంటూ నిజామాబాద్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అర్చన తల్లి ఫిర్యాదు చేయగా అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు. నిన్నటిదాకా కళ్లముందు మెదిలిన పిల్లలతోపాటు కన్నకూతురు జీవచ్ఛవాల్లా పడి ఉండడాన్ని చూసిన తల్లితోపాటు వారి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై బాసర ఏ ఎస్సై నర్సయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.