తెలంగాణ

మిషన్ భగీరథపై చర్చకు సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 17 : తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం కల్వకుంట్ల భగీరథగా మారిందని టిపిసిసి చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మిషన్ భగీరథలో జరిగిన అవినీతిపై చర్చించేందుకు దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. గురువారం సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామం వద్ద విలేఖరులతో మాట్లాడారు. కెసిఆర్ సంక్షేమ పథకాల పేరిట అవినీతికి పాల్పడుతూ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని, నిర్బంధించడం సరికాదన్నారు. మూడేళ్లలో ఎన్ని రోజులు 144 సెక్షన్ విధించారో శే్వతపత్రం విడుదల చేయాలన్నారు. మల్లన్నసాగర్‌లో 400 రోజులకు పైగా 144 సెక్షన్ విధించారన్నారు. హామీలను అమలు చేయమంటే నిర్బంధం చేస్తున్నారన్నారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని నిర్బంధించారని, జెఎసి చైర్మన కోదండరామ్‌ను నిర్బంధించడంతో పాటు అడుగడుగునా అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. చరిత్రలో నిరంకుశంగా, నియంతగా వ్యవహరించిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయారన్నారు. తమను భయపెట్టినా బ్లాక్‌మెయిల్ చేసినా ప్రజాస్వామ్యవాదులుగా ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులతో 20 ఏళ్ల్లలో 15.50 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా దేశంలో తొలిసారిగా ఐటిటిఆర్ ప్రాజెక్టును మంజూరు చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఐటిటిఆర్ ప్రాజెక్టులో మరో 55 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా లభించే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం 58 వేల ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. 2013లో నిధులు మంజూరు చేసి భూమి పూజ, శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. తెలంగాణ సర్కార్ మూడున్నర ఏళ్లు గడిచినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలన్ని పక్కదారి పట్టించారని విమర్శించారు. ఈ సమావేశంలో సిద్దిపేట కాంగ్రెస్ ఇన్‌చార్జి శ్రీనివాస్‌గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మ, టిపిసిసి వైస్ చైర్మన్ వహిద్‌ఖాన్, జిల్లా కార్యదర్శి నర్సయ్య, బొమ్మల యాదగిరి,తిరుపతిరెడ్డి, దాసరి రాజు, రవి, కలీమోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.