తెలంగాణ

చిన్నారిపై టీచర్ దాష్టీకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెబ్బేరు, ఆగస్టు 17: ఉపాధ్యాయుల దెబ్బలకు తాళలేక 3వ తరగతి విద్యార్థి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ పరిధిలోని శేర్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఆనంద్ విద్యార్థిని రెండు రోజుల క్రితం పద్యం నేర్చుకొని రమ్మని ఉపాధ్యాయుడు మందలించాడు. తిరిగి గురువారం మళ్లీ ప్రశ్నించడంతో పద్యం నేర్చుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న పొరకతో తీవ్రంగా కొట్టాడు. దీంతో దెబ్బలకు తాళలేని విద్యార్థి ఇంటికి వెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు 108 అంబులెన్స్ వాహనంలో వనపర్తికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలు ఉండడంతో హుటాహుటిన మహబూబ్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. వివరాలు తెలుసుకునేందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు ఈశ్వర్ ఉపాధ్యాయుడు తమ సెల్‌ఫోన్‌ను స్విచ్‌ఆఫ్‌లో పెట్టి పరారయ్యారు.