తెలంగాణ

జగ్గారెడ్డి దీక్ష భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 17: సంగారెడ్డిలో వైద్య కళాశాలకు వెంటనే శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి గురువారం నిర్వహించతలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసారు. పాత బస్టాండ్ సమీపం వద్ద ఉన్న తన స్వగృహం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ ర్యాలీతో ఆయన కలెక్టరేట్‌కు బయలుదేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిన మెడికల్ కాలేజీని అక్రమంగా సిద్దిపేటకు తరలించుకుపోయారని, వెంటనే మంజూరు చేయాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే డిఎస్పీ తిరుపతన్న నేతృత్వంలో సంగారెడ్డి టౌన్, రూరల్, సదాశివపేట, కొండాపూర్, జిన్నారం, జోగిపేట, అమీన్‌పూర్ సిఐలు రామకృష్ణారెడ్డి, నరేందర్, గిరిజాల వెంకటేశ్వర్లు, రఘు, శ్యామల వెంకటేశం, వెంకటయ్య, రాంరెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి జగ్గారెడ్డిని అడ్డుకున్నారు. అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా జగ్గారెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు ప్రతిఘటించారు. బలవంతంగా అతనిని అరెస్టు చేసి పోలీసు వాహనంలో కూర్చోబెట్టగా కార్యకర్తలు వాహనానికి అడ్డుపడ్డారు. కార్యకర్తలను లాగేసిన పోలీసులు ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లే ప్రయత్నం చేసి తిరిగి పుల్కల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. కాగా, జగ్గారెడ్డి సతీమణి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి తన వాహనంలో వెళ్తుండగా ఆమెను కూడా అరెస్టు చేసారు. స్వంత పూచీకత్తుపై జగ్గారెడ్డితో పాటు అరెస్టు చేసిన వారిని పోలీసులు విడుదల చేశారు. ఇదిలావుండగా, సంగారెడ్డిలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసే వరకు పోరాటం ఆపేది స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావు తమ ప్రాంతానికి ప్రాధాన్యతను ఇస్తున్నారని ధ్వజమెత్తారు. అమరుల త్యాగాల పునాదులపై గెలిచిన కెసిఆర్ తెలంగాణ ప్రజల మనోభావాలను ఒక్క సిద్దిపేటకే పరిమితం చేయడం సిగ్గుచేటన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసే వరకు ఎన్ని పోరాటాలకైనా వెనుకాడే ప్రసక్తి లేదని, అరెస్టులతో ఉద్యమాన్ని అణగదొక్కలేరన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే చిత్తశుద్ధి ఉంటే వెంటనే మెడికల్ కళాశాలను తీసుకువచ్చి జీవోను ప్రజలకు చూపించాలని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో నియోజకవర్గ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

చిత్రం..జగ్గారెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు