తెలంగాణ

సూపర్ స్పెషాలిటీ డిఎం, ఎంసిహెచ్ కోర్సుల కౌన్సిలింగ్ నిలిపివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 18 నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం (విజయవాడ), కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం (వరంగల్) ద్వారా జరగాల్సిన సూపర్ స్పెషాలిటీ డిఎం, ఎంసిహెచ్ కోర్సుల కౌన్సిలింగ్‌ను నిలిపివేయాలని హైకోర్టు స్టే మంజూరు చేసింది.
తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ ప్రక్రియను చేపట్ట వద్దని స్పష్టం చేసింది. డాక్టర్ బి.సతీష్‌కుమార్, మరో 12 మంది సూపర్ స్పెషాలిటీ సీట్లను ఆశిస్తున్న పిటీషనర్లు దాఖలు చేసిన పిటీషన్లను జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ టి.రజనీతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 2017 నీట్ సూపర్‌స్పెషాలిటీ కామన్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఈ సీట్లను భర్తీ చేయాలంటూ కేంద్రప్రభుత్వం జారీ చేసిన లేఖను సవాల్ చేస్తూ ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు