తెలంగాణ

పంచాయతీరాజ్‌లో ఆన్‌లైన్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: ‘పేపర్ లెస్ పాలన’ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే పంచాయతీ రాజ్ శాఖలో ఇక మీదట అన్ని సేవలనూ ఆన్‌లైన్‌లోనే కొనసాగించాలని భావిస్తున్నది. గ్రామాల్లో తొలుత ఆస్థి పన్నుతో ప్రారంభించాలని, ఆ తర్వాత ఇళ్ళ నిర్మాణం, వాటికి సంబంధించిన లే-అవుట్లు, ఇంకా నల్లా కనెక్షన్లు తదితర అనుమతులన్నీ ఆన్-లైన్‌లోనే చేసుకునేలా చర్యలు చేపట్టింది.ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాల్లో 8,684 గ్రామ పంచాయతీల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సంబంధిత ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. దీనిపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల బృందాన్ని మధ్య ప్రదేశ్‌కు పంపించారు. పంచాయతీరాజ్ కమిషనర్ నీతు ప్రసాద్ నేతృత్వంలో అదనపు కమిషనర్ రామారావు, జిల్లా అధికారులు సురేష్ (మేడ్చల్), పద్మజ (రంగారెడ్డి జిల్లా) భోపాల్‌లో పంచాయతీరాజ్ శాఖను సందర్శించి, అక్కడ అమలు అవుతున్న ఇ-పంచాయతీరాజ్ పల్లె సమగ్ర సేవా కేంద్రాల విధానాన్ని పరిశీలించారు. రాష్ట్రంలోని 5,785 గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో ఇ-పంచాయతీ విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా కంప్యూటర్లు, ఇతర సౌకర్యాలను పంపిణీ చేసింది. ఇ-పంచాయతీ అంటే ఆన్‌లైన్ విధానం ద్వారా పారదర్శకత పెరుగుతుందని, మధ్యదళారీల బెడద నుంచి ప్రజలను కాపాడవచ్చనేది ప్రభుత్వ ధృక్ఫథం. ఆన్-లైన్ విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా కొత్తగా 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.