తెలంగాణ

విద్యార్థులపై తేనెటీగల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, ఆగస్టు 18: కరీంనగర్ జిల్ల్లా గంగాధర మండలంలోని గర్శకుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులపై తేనెటీగలు దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏపుగా పెరిగిన చెట్లకు తేనెతెట్టెలు ఉండగా, మధ్యాహ్నం ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చిన విద్యార్థులపై తేనెటీగలు గుంపు లేచి దాడి చేయడంతో 17 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. తేనెటీగలు దాడి సమయంలో వర్షం రావడంతో పాఠశాలలోకి వెళ్లి పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు డోర్లు వేసుకోగా, తేనెటీగలు వెళ్లిపోయాయి. వర్షం తగ్గుముఖం పట్టడంతో మళ్లీ తేనెటీగలు లేవడాన్ని చూసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో మరో ప్రమాదం తప్పింది. గాయపడిన విద్యార్థులను ప్రధానోపాద్యాయులు కిషన్ రెడ్డి గంగాధర ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. వెంకటసాయి, అక్షిత్ అనే ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలై అస్వస్థతకు గురికాగా కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న పలువురు విద్యార్థులను ప్రజాప్రతినిదులు, అధికారులు పరామర్శించారు.