తెలంగాణ

ప్రాజెక్టులకు కేసులు అడ్డు కావద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: కోర్టు కేసులు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉండడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోందని, నిర్ణీత కాల వ్యవధిలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోతే రైతులకు న్యాయం చేయలేమని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని అన్నారు. జల సౌధలో ప్రభుత్వ ప్లీడర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి హరీశ్‌రావు శనివారం సమావేశం అయ్యారు. ఇరిగేషన్ శాఖలో సమన్వయం కోసం ఇలాంటి సమావేశం జరగడం తొలిసారి, ప్రాజెక్టుల నిర్మాణానికి కేసులు అడ్డంకిగా మారకుండా చూడాలని, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కావాలని అన్నారు. న్యాయపరమైన చిక్కులను త్వరగా పరిష్కరించాలన్నారు. కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాకుండా బలమైన వాదన వినిపించాలని, కేసుల వల్ల నిర్మాణం ఆగిపోతే ప్రజల సొమ్ము ఎలా వృథా అవుతుందో వివరించాలని, ప్రాజెక్టు వ్యయం పెరగడం ద్వారా కలిగే భారం గురించి వివరించాలని చెప్పారు. వివిధ ప్రాజెక్టులపై కోర్టుల్లో ఉన్న కేసులను సమీక్షించారు. కేసుల్లో కౌంటర్ అఫిడవిట్లను సకాలంలో దాఖలు చేయకపోవడం, సమర్థంగా వాదించక పోవడం వంటి కారణాలతో కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులు ఉత్తర్వులు ఇస్తున్నాయని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రాముఖ్యత, రైతాంగం ప్రయోజనాలు, వ్యవసాయ రంగంలో సంక్షోభానికి చరమగీతం పాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను న్యాయస్థానాల్లో బలంగా వాదించాలని అన్నారు.
జిల్లాల్లోని వివిధ కోర్టుల్లో వాదనల కోసం అవసరం అయితే హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదులు, నిపుణులైన న్యాయవాదులను ఎంగేజ్ చేసుకోవాలని అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దీర్ఘకాలిక వ్యూహాలతో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని, దీనికి అనుగుణంగా ఇరిగేషన్, రెవెన్యూ, న్యాయశాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో పని చేయాలని మంత్రి కోరారు.
ఆయా శాఖల అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలని అన్నారు. దేవాదుల , ఎఎంఆర్‌పి, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులలో పలుచోట్ల పది, ఇరవై ఎకరాల భూ సేకరణ సమస్యల వల్ల కోర్టు కేసుల్లో చిక్కుకున్న కారణంగా వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోతున్నామని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కేసులు పరిష్కారం కాకుండా ఉన్నాయని కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు గ్రీన్ ట్రిబ్యునల్‌లో, హైకోర్టులో తప్పుడు కేసులు వేస్తున్నారని చెప్పారు. భూ సేకరణ కేసులు సత్వరం పరిష్కారం అయ్యేట్టు చూడాలని కోరారు. కొన్ని సందర్భాల్లో ప్రాజెక్టు వ్యయం కన్నా భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు అసాధారణంగా ఉన్నాయన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు వ్యయం రూ.400 కోట్ల రూపాయలు కాగా, పరిహారం కోసం 1400కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చిందన్నారు. స్టే ఉత్తర్వుల వల్ల ప్రాజెక్టుల, కాలువల నిర్మాణ పనులు పెండింగ్‌లో పడిపోతున్నాయని అన్నారు. స్టే వెంటనే వెకేట్ చేసేలా చూస్తే వ్యయం తగ్గుతుందని చెప్పారు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, ప్రభుత్వ ప్లీడర్ల మధ్య సమన్వయం లోపం వల్ల కేసుల పరిష్కారానికి జాప్యం జరుగుతోందని అన్నారు. ఈ లోపం లేకుండా జిల్లా కలెక్టర్లు చర్య తీసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. కోర్టు కేసుల చిక్కుముడుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖలో ఒక లీగల్ విభాగాన్ని నెలకోల్పనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. ఇకపై లీగల్ టీం తో పాటు జిల్లాల ప్రభుత్వ న్యాయవాదులు, ఇరిగేషన్ అధికారులతో వెంటనే వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని మంత్రి సూచించారు.

చిత్రం..శనివారం సచివాలయంలో ఇరిగేషన్ ప్లీడర్లు, అధికారులతో సమావేశమైన మంత్రి హరీశ్‌రావు