జాతీయ వార్తలు

టి- సర్కారే జీతాలివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగినవారంటూ తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన 1253మంది విద్యుత్ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వారికి తెలంగాణ ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో వేతనాలు చెల్లించాలన్న హైకోర్టు ఉత్తర్వులను సవరించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఖలీఫుల్లా, జస్టిస్ బాబ్డేలతో కూడిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఏ రాష్ట్రంలో ఉద్యోగులు పని చేస్తుంటే ఆ రాష్టమ్రే వంద శాతం వేతనాలు చెల్లించాలంటూ ఏపి వాదించింది. కాగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలోపే ఏపి స్థానికత కలిగిన 1253 మంది ఉద్యోగులను రిలీవ్ చేసిందని కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 58:42 నిష్పత్తిలో వేతనాలు చెల్లిస్తున్నామని ధర్మాసనానికి వివరించారు. విద్యుత్ ఉద్యోగుల తరపున సీనియర్ న్యాయవాది వికాస్ వాదనలు వినిపిస్తూ ఉద్యోగులకు ఏదో ఒక రాష్టమ్రే వేతనాలు చెల్లించే వెసులుబాటు కల్పించాలని కోరారు. ఉద్యోగులు ఇష్టమున్న రాష్ట్రాన్ని ఎంచుకునేందుకు ఆప్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రం వంద శాతం వేతనాలను చెల్లించాలని తీర్పు చెప్పింది. అలాగే రిలీవ్‌కు సంబంధించిన పిటిషన్లపై ఎనిమిది వారాల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు సూచించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఏపీ స్థానికత కలిగిన 1253 మంది ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ విద్యుత్ ఉద్యోగులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు... ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలోవేతనాలు చెల్లించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యుత్ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.