తెలంగాణ

ఒలిఫెంటా వద్ద మెట్రో ఆర్వోబి పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: మెట్రోరైలును వచ్చే నవంబర్ నెలాఖరులోగా ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే అమీర్‌పేట మైత్రివనం ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ పనులతో పాటు ఇతర పలు ప్రాంతాల్లో ఆహార్నిశలు పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే సికిందరాబాద్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తయినట్లు మెట్రోరైలు అధికారులు శనివారం వెల్లడించారు. సుమారు 272 అడుగుల ఎత్తు కల్గిన రెండు మెట్రో పిల్లర్లను నిర్మించి, వాటి మధ్య ఈ స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. నాగోల్ నుంచి వచ్చే కారిడార్ 3, అలాగే జెబిఎస్ నుంచి సిబిఎస్ వరకు నిర్మిస్తున్న కారిడార్ 2ల పనులకు ఈ జంక్షన్‌లో ఉన్న అడ్డంకులు చాలా వరకు తొలగినట్టే. బాక్సు ఆకారంలో స్టీల్‌తో ప్రత్యేక వంతెన ఏర్పాటు పనులను ఇటీవలే ప్రారంభించారు. కానీ ఈ నెల 9వ తేదీనుంచి దీన్ని ఎంతో సురక్షితంగా అమర్చే పనులను చేపట్టిన మెట్రో అధికారులు కేవలం పదిరోజుల్లోనే పూర్తి చేశామని, మెట్రోరైలు లాంటి అరుదైన ప్రాజెక్టుల నిర్మాణంలో సవాలుగా మారిన ఇలాంటి కూడళ్లలో ఇంత తక్కువ సమయంలో ఆర్వోబిని పూర్తి చేయటం అరుదైన రికార్డుగా మెట్రోరైలు అధికారులు అభివర్ణించారు. ఈ స్టీల్ బ్రిడ్జిని గజియాబాద్‌లో తయారు చేసి, అక్కడ దాన్ని విడిభాగాలుగా విప్పి ప్రత్యేక భారీ కంటైనర్‌లో ఇక్కడకు తీసుకువచ్చారు. దీన్ని తిరిగి భిగించేందుకు రైల్వే శాఖకు చెందిన ఎకరం స్థలాన్ని మెట్రోరైలు లీజుకు తీసుకుంది. దీన్ని సురక్షితంగా అమర్చేందుకు అమెరికన్ పుల్లింగ్ జాక్‌లను రప్పించారు. మరో 15రోజుల్లో వంతెన ఇంటర్నల్ డెక్ స్లాబును నిర్మించనున్నట్లు తెలిపారు. సుమారు 272 అడుగుల పొడువున్న ఈ బ్రిడ్జి 57 అడుగుల వెడల్పు ఉంది. 35 అడుగుల ఎత్తులో దీన్ని బాక్సు ఆకారంలో అమర్చినట్లు తెలిపారు.

చిత్రం..ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జిని పరిశీలిస్తున్న మెట్రోరైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి