తెలంగాణ

మాఫియా, అక్రమాల అడ్డాగా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: రాష్ట్రానికి రావలసిన ఐటిఐఆర్ ప్రాజెక్టు, ఉద్యోగాలూ ఏమయ్యాయని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మూడేళ్ళ పాలనలో రాష్ట్రం అవినీతికి, అక్రమాలకు, మాఫియాలకు అడ్డాగా మారిందని ఆయన విమర్శించారు. శంషాబాద్ మండలంలోని మదనపల్లిలోని శనీశ్వరాలయంలో శనివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన అక్కడి విలేకరులతో మాట్లాడుతూ అవినీతికి, అక్రమాలకు, మాఫియాకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన చరిత్రలో నిలిచిపోతుందని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం లేకుండా పోయిందని, అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన మాత్రమే కొనసాగుతున్నదన్నారు. ఐటిఐఆర్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని, 2014లో, 2016 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో గొప్పగా ప్రస్తావించారని ఆయన గుర్తుచేశారు.
దీంతో రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 50 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఐటిఐఆర్ ఏమైందో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కెసిఆర్ పరస్పరం పొగుడుకుంటారని, అయినా కేంద్రం నుంచి ఐటిఐఆర్‌కు నిధులు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. నిజానికి ఐటిఐఆర్‌ను 2013లోనే యుపిఎ ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన కృషి ఫలితంగానే అన్ని రకాల అనుమతులు వచ్చాయని, భూసేకరణ, ఇతర సాంకేతిక పనులు కూడా ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడున్నర ఏళ్లు దాటినా ఐటిఐఆర్ గురించి ఎందుకు శ్రద్ధ తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. పెద్ద ఎత్తున ఉద్యోగవకాశాలు కలిగే ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పిన కెసిఆర్ ఈ మూడేళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తమ్ వెంట ఎంపి నంది ఎల్లయ్య, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి, కార్తీక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.