తెలంగాణ

మద్యాన్ని నిషేధించాలి అందుకు చట్టం తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయని, ప్రభుత్వం కూడా పరోక్షంగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోందని శనివారం నాడిక్కడ జరిగిన విద్యావంతుల చైతన్య వేదిక సదస్సులో వక్తలు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మద్యం నియంత్రణకే పరిమితం కాకుండా నిషేధించాలని వేదిక కోరింది. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ మనోహరరావు నిర్వహించగా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య వక్తగా హాజరయ్యారు. కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ పొదిలి అప్పారావు, ప్రొఫెసర్ బీమ్‌రావు, ఇండో యుఎస్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ ప్రసాదరావు, సైంటిస్టు డాక్టర్ ఎ వి రావు, దూరదర్శన్ మాజీ సంచాలకుడు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, తీవ్రత, ప్రభావం, కుటుంబాలు, సమాజంపై పడుతున్న దుష్ప్రభావం, ఆర్ధిక ప్రభావం, మద్యం నిషేధానికి ఉన్న పరిష్కారాలు, ప్రత్యామ్నాయాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమాజంలో మార్పు తేవల్సిన సమయం ఆసన్నమైందని, అవసరమైతే ఎన్‌జిఓలు, ఇతర మేథావులు, రాజకీయ పార్టీల సలహాలు, సమన్వయంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని వేదిక నిర్ణయించింది. బీహార్‌లో మద్య నియంత్రణ అమలులోకి వచ్చిందని, ఇక్కడ ఎందుకు జరగదని వక్తలు ప్రశ్నించారు. నియంత్రణలో లోపంతో పాటు బార్లు గోల్డెన్ అవర్స్, హాపీ అవర్స్ అంటూ ఆఫర్లు ఇస్తున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం చూస్తుంటే పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోందని వక్తలు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఎంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా ప్రభుత్వానికి చలనం లేదని డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. లిక్కర్ నిధులతోనే ప్రభుత్వం నడపాలని చూస్తున్నట్టుందని ఆయన ఆరోపించారు. వేదిక అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నానని, వీలైతే బిజెపిలో చర్చించి మద్యం నిర్మూలనకు తీర్మానం చేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి 13వేల నుండి 16వేల కోట్ల ఆదాయం వస్తున్నా ప్రజలు మాత్రం 41వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని దానిని కూడా ఆలోచించాలని వక్తలు పేర్కొన్నారు. మరో పక్క కుటుంబాలపైనా ఎంతో ప్రభావం చూపుతోందని అన్నారు.