తెలంగాణ

మాకు పదోన్నతులు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: పోలీస్ శాఖలో 1989-91 బ్యాచ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్లుగా నియామకం అయినవారు శనివారం సచివాలయంలో హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మను కలిసి తమకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. ఈ బ్యాచ్‌కు చెందిన వారికి ఇప్పటి వరకు సిఐలుగా ప్రమోషన్ లభించింది. ఆ తర్వాత డిఎస్‌పిలుగా ప్రమోషన్లు రావలసి ఉన్నప్పటికీ, రాలేదని సాంకేతిక కారణాల వల్ల ప్రమోషన్లు ఆగిపోయాయని వీరు హోంమంత్రికి తెలిపారు. తమ ప్రమోషన్లకు సంబంధించిన ఫైల్ హోంమంత్రిత్వ శాఖలో పెండింగ్‌లో ఉందని, తమకు ప్రమోషన్ ఇవ్వకుండా 1995 బ్యాచ్‌కు చెందిన వారికి ప్రమోషన్లు ఇస్తున్నారని వారు మంత్రికి తెలిపారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ అంశంపై పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు ఒక సిఐ ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు.