తెలంగాణ

నైపుణ్యం పెంచేందుకు ‘టాస్క్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 19: ప్రభుత్వం కల్పిస్తున్న వౌలిక వసతులు, సదుపాయాల కారణంగా రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నా నైపుణ్యం లేని కారణంగా రాష్ట్రానికి చెందిన యువతకు ఉద్యోగావకాశాలు పూర్తిస్థాయిలో లభించటం లేదని టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) ముఖ్య కార్యనిర్వహణాధికారి సుజిత్ నాయక్ తెలిపారు. వరంగల్ కేంద్రంగా టాస్క్ రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఇక్కడి యువతలో వివిధ అంశాలపైలో నైపుణ్యత పెంపొందించడం ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించడంపై వివిధ వర్గాలతో శనివారం నగరంలోని హరిత హోటల్‌లో టాస్క్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది.
సమావేశంలో పాల్గొన్న వివిధ కంపెనీల ప్రతినిధులు, నగరంలోని ప్రముఖ హోటళ్లు, కార్పొరేట్ ఆసుపత్రులు, డి-మార్ట్, స్పెన్సర్ తదితర ప్రముఖ వ్యాపార సంస్థలు తమ సంస్థలలో ఉన్న ఉద్యోగావకాశాల గురించి, ఉద్యోగాలకోసం వస్తున్న అభ్యర్థులలో లోపించిన నైపుణ్యాల గురించి వివరించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టాస్క్ సిఇఓ సుజిత్ నాయక్ మాట్లాడుతూ ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు వచ్చే నెలలో వరంగల్ నగరంలో టాస్క్ రీజనల్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడంతోపాటు స్థానికంగా ఉన్న వివిధ పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ రాజధాని హైదరాబాద్ తరువాత వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వరంగల్‌ను ఐటి, ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని సిఎం నిర్ణయమని, త్వరలో ఇక్కడ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు కాబోతోందని అన్నారు. ఇవన్నీ అమలులోకి వస్తే ఈ ప్రాంత యువతకు భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఐటి రంగంలోనే కాకుండా టూరిజం రంగంలో కూడా వరంగల్‌లో మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు.
జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రిషికేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే ఉన్న చిన్న, మధ్యతరహ పరిశ్రమల్లో చాలామందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని, కానీ నైపుణ్యత కలిగిన అభ్యర్థులు లభించడం లేదని పరిశ్రమల యాజమాన్యాలు వివిధ సందర్భాలలో తమ దృష్టికి తీసుకువచ్చాయని తెలిపారు. టాస్క్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు ద్వారా ఇక్కడ నిరుద్యోగ యువతలో వివిధ పరిశ్రమకు సంబంధించి నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. వరంగల్ ప్రాంతంలో 364 చిన్నతరహా పరిశ్రమలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని, వీటిలో ఒక్కొక్క పరిశ్రమలో కనీసం 10 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు.
వరంగల్ నిట్‌కు చెందిన ప్రొఫెసర్ ప్రసాద్ మాట్లాడుతూ టాస్క్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణలో భాగంగా కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగ యువతకు అవసరమైన శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన టాలీతోపాటు జిఎస్‌టిలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు ప్రస్తుత పరిస్థితుల్లో మంచి అవకాశాలు ఉన్నాయని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తెలిపారు. నైపుణ్యం కలిగిన అభ్యర్థులు లభిస్తే తమ సంస్థలలో తప్పనిసరిగా అవకాశాలు ఇస్తామని పలు కంపెనీల ప్రతినిధులు, కార్పొరేట్ ఆసుపత్రుల, వ్యాపార సంస్థల నిర్వాహకులు సమావేశంలో హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎస్‌పిటి అధికారి కిరణ్‌కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి రాము, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్, నెహ్రూ యువక కేంద్రం కో-ఆర్డినేటర్ మనోరంజన్ పాల్గొన్నారు.

చిత్రం..టాస్క్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు