తెలంగాణ

గుండె జబ్బులపై నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: దేశ జనాభాలో కేవలం ఒక శాతం మంది మాత్రమే గుండె వ్యాధులు రాకుండా ముందుగానే నివారణ ప్రక్రియ చేపడుతున్నారని ఫ్యాక్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్‌కుమార్ అన్నారు. గుండె వ్యాధుల భారాన్ని తగ్గించేందుకు అత్యవసరంగా 50 శాతం జనాభా నివారణ ప్రక్రియలను పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఫ్యాక్ట్స్ ఫౌండేషన్ ఇండియా, అమెరికాకు చెందిన కార్డియోవాస్కులర్ రీసెర్చి ఫౌండేషన్ (సిఆర్‌ఎఫ్) భాగస్వామ్యంతో భారత దేశంలోనే తొలిసారిగా ‘అడ్వాన్స్‌డ్ కార్డియోవాస్కులర్ సొల్యూషన్స్ (ఎసివిఎస్) ఇండియా 2017’ పేరుతో ప్రతిష్ఠాత్మక సదస్సును ఈ నెల 17 నుంచి 20 వరకు నగరంలోని హెచ్‌ఐసిసిలో నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డాక్టర్ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ రోగులు ఆరోగ్యకరమైన అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లు, బిపి, మధుమేహం వ్యాధులను అదుపులో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే 80 శాతం వరకు గుండెపోటు వంటి వ్యాధులను దరిచేరవని అన్నారు. ఈ సదస్సులో ప్రతిభావంతులైన కరోనరీ, ఫెరిఫెరల్, స్ట్రక్చరల్ ఇంటర్వెన్షనల్‌పై ప్రాథమిక, ఆధునిక మెళకువలను ప్రదర్శించారని తెలిపారు. ఈ సదస్సులో సుమారు 1500 మంది ప్రతినిధులతో పాటు 200 మందికి పైగా ప్రొఫెసర్లు హాజరైనట్లు తెలిపారు.