తెలంగాణ

ఇరిగేషన్ శాఖలో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖలో ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో, వాట్సాప్‌లో సమీక్షిస్తున్నారు. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ విభాగాల సిఇలకు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అన్నారు. జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున చెరువులు తెగిపోయే ప్రమాదం ఉందని ఆ జిల్లాల సిఇలు, ఎస్‌ఇలను అప్రమత్తం చేశారు. ఇంజనీర్లంతా వారి హెడ్ క్వార్టర్‌లోనే ఉండాలని చెప్పారు. ప్రతి గంటకు వర్షపాతం నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాలకు చెరువులు, తూములు తెగిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సిమెంట్ సంచులు, ఇసుక బస్తాలు నిల్వ ఉంచుకోవాలని, అన్నీ ముందస్తుగానే గుర్తించాలని ఇరిగేషన్ సబ్ డివిజన్ల అధికారులను మంత్రి ఆదేశించారు. చెరువులు, రిజర్వాయర్లలో ఏ మేరకు నీళ్లు చేరాయో వాటిని నమోదు చేసి జిల్లా అధికారులకు వెంటనే పంపించాలని చెప్పారు. భారీ వర్షాలకు కొన్ని చోట్ల చెరువులు పొంగి పొర్లే అవకాశం ఉందని, చెరువుల రక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. కింది స్థాయి నుంచి సిఇ వరకు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని కోరారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి సమన్వయంతో పని చేసుకొని భారీ వర్షాల సమయంలో చెరువులను కాపాడుకోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా క్షమించేది లేదని మంత్రి చెప్పారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అత్యవసర పరిస్థితులు తలెత్తగానే జిల్లా కలెక్టర్లకు, ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని హరీశ్‌రావు ఇంజనీర్లను కోరారు. ఒకవేళ ముంపు పరిస్థితి తలెత్తితే ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.