తెలంగాణ

ఘనంగా విమోచన దినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: వచ్చే నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర పదాదికారుల సమావేశం నిర్ణయించింది. ఆదివారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. సమావేశానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వచ్చే నెల 7 నుంచి 11వ తేదీ వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ప్రదర్శనలు నిర్వహించి, అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే నెల 1 నుంచి 9వ తేదీ వరకు తెలంగాణలోని పాత 10 జిల్లాల్లో పార్టీ ముఖ్య నాయకులు పర్యటించి నాడు రజాకార్లను ఎదిరించి పోరాటం చేసిన కుటుంబాలను కలుసుకోనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా రజాకార్లను ధైర్యంగా ఎదిరించి పోరాటం చేసిన ముఖ్య స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి స్మారక కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో డిమాండ్ చేస్తూ తీర్మానం చేసినట్లు ఆయన చెప్పారు. సెప్టెంబర్ 17న తెలంగాణకు విమోచన లభించినందున ఆ రోజన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. వచ్చే నెలలో పార్టీ ముఖ్య నేతల సమావేశానికి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై చర్చించలేదని, ఆ చర్చ ఇప్పుడు అప్రస్తుతమని అన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన వివరించారు.

చిత్రం..పదాధికారుల సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి దత్తాత్రేయ, కె.లక్ష్మణ్, కిషన్‌రెడ్డి తదితరులు