తెలంగాణ

తెలంగాణ అభివృద్ధికోసం.. రాజకీయ నాయకత్వం ఏకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయ నాయకత్వమంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా మున్సిపల్ చైర్‌పర్సన్ మి విజయలక్ష్మిరవి, వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్, కౌన్సిలర్లు మురళీధర్, ఉదయశ్రీ, స్వప్న, ఉదయ్ కిరణ్, టేకుల విజయకృష్ణ, షబానా బేగం తదితరులు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద నాయకత్వంలో మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవాలన్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
నీరు లేక సింగూరు ఎండిపోయి మొసళ్లు ఊళ్ల మీదకు వస్తున్నాయని, ఇలాంటి కరువు పరిస్థితులను తెలంగాణ నుంచి పారదోలేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్టు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినట్టే రాష్ట్రంలో ఆదాయం ఆశాజనకంగా ఉందని, నిధుల కొరత లేదని, మంచి ప్రభుత్వం కూడా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. అనుకున్న పనులన్నీ పద్ధతి ప్రకారం పూర్తి చేసుకుందామని సిఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సింగూరును నింపుతామని, జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి ప్రత్యేక నిధులిచ్చి అభివృద్ధి చేస్తామని సిఎం ప్రకటించారు. శివారు మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

chitram టి.సిఎం కెసిఆర్‌కు అభివాదం చేస్తున్న మెదక్ జిల్లా మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మిరవి