తెలంగాణ

పోరాడారు... బడిని సాధించుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 21: సక్రమంగా నడుస్తున్న ఆ సర్కారీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో అధికారులు మూసివేశారు. అయతే, అదే పాఠశాలలో పెద్దపల్లికి మంజూరైన అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. తమ పాఠశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయరాదని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొండి పట్టుదలతో ఉద్యమం చేసి, చివరగా తమ బడిని సాధించుకున్నారు. ఫలితంగా మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలను సోమవారం పునఃప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలంలో బ్రాహ్మణపల్లిలోని ప్రభుత్వ పాఠశాల కథాకమామిషు ఇది.
పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని, హైకోర్టును ఆశ్రయించడంతో పాటు విద్యార్థులు లేఖల ద్వారా తమ గోడును వెళ్లబోసుకున్నారు. కలెక్టర్, డిఇవోలకు పలుమార్లు వినతిపత్రం సమర్పించి, పాఠశాలను కొనసాగించాలని విన్నవించుకున్నారు. అయినా అధికారుల నుంచి సరైన స్పందన లభించలేదు. పాఠశాల మూసివేతకు నిర్ణయం తీసుకున్నా, విద్యార్థులు అదే పాఠశాలలో ఉంటూ చదువు కొనసాగించారు. గత శనివారం పాఠశాలకు వచ్చిన సీనియర్ సివిల్ జడ్జి పట్ట్భారామారావు, జూనియర్ సివిల్ జడ్జి రాజేందర్, డిఇవో వెంకటేశ్వరరావులకు పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని వేడుకున్నారు. అనంతరం వెళ్లడానికి సిద్ధమైన డిఇవో వెంకటేశ్వరరావు కారును అడ్డుకున్నారు. డిఇవోను చుట్టిముట్టి తమ పాఠశాల పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన డిఇవో సోమవారం నుంచి పాఠశాలను యధావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. డిఇవో ఇచ్చిన ఆదేశాల మేరకు పాఠశాల ప్రధానోపాధాయుడు సురేందర్ కుమార్‌తో పాటు మరో ఉపాధ్యాయుడు సోమవారం పాఠశాలలో విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. పోరాడి సాధించుకున్న బడి యధావిధిగా నడుస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామని డిఇవో వెంకటేశ్వర్‌రావు ‘ఆంధ్రభూమి’కి తెలిపారు.