తెలంగాణ

వన్యప్రాణి సంరక్షణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: వన్యప్రాణి సంరక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మత్రి జోగు రామన్న తెలిపారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో వన్యప్రాణి సంరక్షణపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, టైగర్ రిజర్వ్‌లలో నిఘాను మరింత పెంచి సంరక్షణ చర్యలు మరింత పటిష్ఠం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వన్యప్రాణి సంరక్షణ, పలు అంశాలపై అధ్యయనానికి వరల్డ్ వైడ్ ఫండ్ సంస్థ సహకారాన్ని తీసుకోనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అమ్రాబాద్ అడవుల్లో కొత్తగా అడవి దున్నలు, గేదె, మూషిక జింకలను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అంతకు ముందు అక్కడి వాతావరణంపై అధ్యయనం చేయనున్నట్టు ఆయన చెప్పారు. టైగర్ రిజర్వు ప్రాంతాల్లో సోలార్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు స్థానిక గిరిజనులకు హైదరాబాద్ శివారులోని దూలపల్లి అటవీ శాఖ అకాడమీలో ఈ ఏడాది శిక్షణ ఇవ్వనున్నట్టు జోగు రామన్న తెలిపారు. గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు కార్యాచరణను రూపొందించాలని కూడా మంత్రి అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ మాజీ స్పీకర్, వన్యప్రాణి ప్రేమికుడు, పర్యావరణ వేత్త కె సురేష్ రెడ్డి, అటవీ శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, అదనపు పిపిసిఎఫ్ ఎకె శ్రీవాస్తవ, పృథ్వీరాజ్, వరల్డ్ వైడ్ ఫండ్ సంస్థ ప్రతినిధులు అనిల్ కుమార్, ఫరీదా టంపాల్ పాల్గొన్నారు.