తెలంగాణ

సర్కారీ గొర్రెకు ‘రోగం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 21: గొల్ల, కుర్మలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘గొర్రెల పంపిణీ పథకం’ ఆదిలోనే అభాసుపాలవుతోంది. పర్యవేక్షించాల్సిన అధికార గణం పట్టించుకోకపోవడంతో సర్కారు గొర్రెకు ‘రోగం’ సోకుతోంది. రాయితీపై అందించిన జీవాలు అంతుచిక్కని వ్యాధులతో మృత్యువాత పడుతుండడంతో లబ్ధిదారుల సంబరం అంతలోనే ఆవిరవుతోంది. సిరిసిల్ల రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో ఇప్పటి వరకు 200 యూనిట్లను మంజూరు చేస్తే ఈ పరిస్థితి ఏర్పడింది. యూనిట్లను 75 శాతం రాయితీపై సర్కారు మంజూరు చేస్తోంది. ఒక్కో యూనిటు విలువ రూ.1.25 లక్షలు. అందులో ప్రభుత్వం 75 శాతం అంటే రూ.93,750 చెల్లిస్తోంది. మిగిలిన రూ.31.250 లబ్ధిదారులు చెల్లించాలి. ఈ జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా నుంచి గొర్రెలను కొనుగోలు చేశారు. రెండు మండలాల్లోని రాజన్నపేట, దుమాల, గొల్లపల్లి, గుండారం, కంచర్ల గ్రామాల్లో 200 గొర్రెల యూనిట్లను ఇటీవల పంపిణీ చేశారు. ఆ సమయంలో జీవాలు ఆరోగ్యంగానే ఉన్నా.. వారం, పది రోజుల్లోనే రోగాల బారిన పడుతున్నాయి. ఒక్కో యూనిటులో రెండు గొర్రెల చొప్పున మృత్యువాత పడుతున్నాయి.
నాలుగు గ్రామాల్లో 45 మృత్యువాత
రెండు మండలాల్లోని రాజన్నపేట, దుమాల, గొల్లపల్లి, గుండారం గ్రామాల్లో 45 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో 60 జీవాలు అస్వస్థతకు గురయ్యాయి. గొల్లపల్లిలో ఇక్కడకు వచ్చిన రోజే 8 గొర్రెలతో పాటు మరో 12, రాజన్నపేటలో 10, గుండారం 6, దుమాల 9 చనిపోయాయి. యేడాదిన్నర వయసు కలిగిన గొర్రెలను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా.. వైద్యాధికారులు మాత్రం ఒక్కో యూనిట్‌లో ఐదు మాసాల వయసు ఉన్న గొర్రె పిల్లలను పంపిణీ చేశారు. ఎనిమిది నెలల గొర్రె పొట్టేలును అందించారు.
మేతలో తేడా వల్లే: పశు వైద్యాధికారిణి రేణుక
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా నుంచి పంపిణీ చేస్తున్న గొర్రెలు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయని పశువైద్యాధికారులు పేర్కొంటున్నారు. కడప జిల్లాలోని గొర్రెలు అక్కడ తుమ్మ చెట్ల ఆకులను మేస్తుంటాయని, ఇక్కడికి వచ్చిన తర్వాత పచ్చిగడ్డి మేయడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నాయని పశువైద్యాధికారిణి రేణుక తెలిపారు. మేతలో తేడా వల్లే మృత్యువాత పడుతున్నాయని, జీవాలకు నీరసం, వీరేచనాలు, దద్దుర్లు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు.
బద్ద పురుగుల వల్ల అస్వస్థత చెందుతున్నాయని, గొర్రెలను దిగుమతి చేసుకునే సమయంలో నట్టల నివారణ మందులు, వాక్సిన్లు వేశారో లేదో తెలియడం లేదని అన్నారు. లబ్ధిదారులు తప్పకుండా మందులు వేయించాలని, గొర్రెలు అస్వస్థతకు గురైన వెంటనే తమకు సమాచారం అందిస్తే చికిత్స చేస్తామని ఆమె పేర్కొన్నారు.