తెలంగాణ

బీరువాలోనే అమ్మవారి విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, ఆగస్టు 21: నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి విగ్రహం తరలింపు, అక్షరాభ్యాస పూజల వివాదం కొలిక్కివస్తోంది. అమ్మవారి విగ్రహాన్ని తరలించి నల్గొండ జిల్లా దేవరకొండలోని ఒక ప్రైవేటు పాఠశాలలో అక్షరాభ్యాస పూజలు నిర్వహించడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. దీంతో దేవాదాయ శాఖ ఆధికారులు స్పందించి ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, సప్తశతి పారాయణదారు ప్రణవ్ శర్మను తొలగించడం తెలిసిందే. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఆలయంలోని ప్రధాన అర్చకునికి చెందిన స్టోర్ రూమ్ బీరువా, అర్చకుల విశ్రాంతి గదిలోని బీరువాను సోమవారం తహశీల్దార్ వెంకటరమణ, ముధోల్ సిఐ రఘుపతి, ఆలయ ప్రత్యేక ఆధికారి డిప్యూటీ కలెక్టర్ సుధాకర్‌రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ గిరిధర్, ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ సమక్షంలో పగులగొట్టి పరిశీలించారు. అర్చకుల విశ్రాంతి గదిలోని బీరువాను పగులగొట్టి చూస్తే అమ్మవారి పంచలోహ విగ్రహం లభ్యమైంది. దీంతో పాటు రూ 8 వేల నగదు, పట్టు వస్త్రాలు, తదితర వస్తువులు లభించాయి. ఈ తతంగం సుమారు రెండుగంటల వరకు కొనసాగింది. అయతే, ఆలయ ప్రధాన అర్చకునికి సంబంధించిన బీరువా తాళాలతో కాకుండా పగులగొట్టి తెరిచి చూడడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయ. ఈ విగ్రహం ఆలయ రికార్డుల్లో పొందుపర్చలేదని దేవాదాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆలయ ప్రత్యేక ఆధికారి సుధాకర్‌రెడ్డిని ఈ విషయమై వివరణ కోరగా దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసుల సహాయంతో ప్రధాన అర్చకునికి చెందిన బీరువాను పరిశీలించామన్నారు. పంచలోహాలతో చేసిన 1.500 గ్రాముల విగ్రహం, 8 వేల నగదు ఆలయానికి చెందిన స్టోర్ రూమ్ బీరువాలో కాకుండా అతని స్వంత బీరువాలో లభ్యమైందని పేర్కొన్నారు.

చిత్రం..ఆలయ ప్రధాన అర్చకుని బీరువాలో లభించిన వస్తువులను పరిశీలిస్తున్న తహశీల్దార్, సిఐ, ఆలయ ప్రత్యేక ఆధికారి