తెలంగాణ

ఏకశిలపై పెద్ద వినాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాజిపేట, ఆగస్టు 22: భారతదేశంలోని అతి పెద్ద వినాయకుడిగా నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల పరిధిలోని ఆవంచ గ్రామంలో వెలసిన ఐశ్వర్య గణపతి ప్రసిద్ధికెక్కాడు. క్రీ.పూ. 1175లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన పశ్చిమ చాళుక్యుల వంశస్థుడైన తైలంపుడు అనే రాజు తన అన్నతో గొడవపడి తండ్రి విక్రమాదిత్యునికి తన రాజ్యాన్ని వదిలి ఆవంచ గ్రామానికి చేరుకొని ఆవంచను రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడు. 30 అడుగుల ఏకశిలపై వినాయకుడి ప్రతిమను చెక్కించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆవంచ గ్రామనివాసి ప్రస్తుత జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తమ గ్రామంలో వెలసిన వినాయకుడిని వెలుగులోకి తేవాలని ప్రతి వినాయక చవితికి పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. దుందుభి నది ఒడ్డున ఊరికి దూరంగా వెలసిన ఐశ్వర్య గణపతి ఆలయ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే, గ్రామస్థులు నిర్ణయించడంతో అదే గ్రామానికి చెందిన రఘుపతిరెడ్డి అనే వ్యక్తి తన రెండెకరాల పొలాన్ని దానం చేశారు. ఆలయ నిర్మాణ విషయమై పలు సేవ ట్రస్ట్‌లకు వివరించగా మహారాష్టల్రోని మహాలక్ష్మి సేవా ట్రస్ట్, ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు విషయం తెలుసుకొని గ్రామానికి వచ్చి పెద్ద ఎత్తున ఐశ్వర్య గణపతికి పూజలు, హోమా లు నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇదిలా వుండగా, ఆలయ నిర్మాణానికి దాదాపు 10 కోట్ల మేరకు ఖర్చు అవుతుంద ని, ఇంకా స్థలాన్ని కొనుగోలు చేయాలని అంచనాలు వేశారు. ఏళ్లు గడుస్తున్నా గుడి నిర్మాణానికి విఘ్నాలు తప్పడం లేదని సకల జనుల విఘ్నాలను తొలగించి భక్తుల బాధలు దూరం చేసే వినాయకుడి ఆలయానికి విఘ్నాలు తొలగి ఆలయ నిర్మాణం జరగాలని గ్రామస్థులు కోరుతున్నారు.