తెలంగాణ

అన్నదాతకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 9: ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తున్న అన్నదాతకు తగిన మద్దతు ధర కల్పించి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ మార్కెట్ విధానానికి శ్రీకారం చుట్టింది. దళారీ వ్యవస్థను నియంత్రించి, తద్వారా రైతులకే నేరుగా ప్రయోజనం కలిగించే లక్ష్యంతో ఈ-మార్కెట్ పేరుతో దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్‌లన్నింటినీ అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈనెల 14న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. దశలవారీగా దేశవ్యాప్తంగా 250 మార్కెట్‌లను ఈ-మార్కెట్ కింద అనుసంధానం చేసి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్కండ్, చత్తీస్‌ఘ్ఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, హిమచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని 250 మార్కెట్‌ను అనుసంధానం చేస్తున్నారు. మొదటివిడతగా తెలంగాణలోని 44 మార్కెట్‌లలో నూతన విధానాన్ని అమలు చేయనున్నారు. అందులో పైలెట్ ప్రాజెక్టుగా ఐదు మార్కెట్‌లను ఎంపిక చేశారు. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి, నిజామాబాద్, హైదరాబాద్‌లోని మలక్‌పేట, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలో బాదేపల్లి మార్కెట్‌లలో ప్రయోగాత్మకంగా ఈ-మార్కెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఎంపికైన మార్కెట్‌లన్నింటినీ దేశవ్యాప్తంగా అనుసంధానం చేసి రైతులు మార్కెట్‌కు తెచ్చే పంటల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఫైలెట్ ప్రాజెక్టు కింద మొదట ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు. రైతులు మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం, ధాన్యం గ్రేడ్, ట్రేడర్‌లు నిర్ణయించిన ధరల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఇందుకోసం రైతులు, ట్రేడర్‌లకు ఐడి నెంబరులను జారీ చేస్తారు. రైతులకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ వివరాలను సైతం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ విధంగా ఆన్‌లైన్‌లో ఉంచిన పంటల వివరాలను అనుసంధానించడం ద్వారా దేశంలోని ఏప్రాంతం నుండైన లైసెన్స్ కలిగిన కొనుగోలుదారులు నేరుగా రైతులు మార్కెట్‌కు తెచ్చిన పంటలను కొనుగోలుచేసే సౌలభ్యం కలుగుతుంది. ఫలితంగా రైతులకు మధ్యదళారీల బెడద లేకుండా మద్దతు ధరకు మించి సైతం ధర లభించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా రైతుల నుండి కొనుగోలు చేసిన పంటలకు సంబంధించిన మొత్తాని 24 గంటలలోపు ఆయా రైతుల ఖాతాల ద్వారా నేరుగా చెల్లింపులు చేయనున్నారు. ఈ విధానం వల్ల రైతులకు ప్రయోజనం కలుగడంతో పాటు మార్కెట్‌లకు సైతం వందశాతం లైసైన్స్ ఫీజుల రూపంలో ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి మార్కెట్‌ను ఎంపిక చేయడంతో ఈప్రాంతం రైతాంగంలో హర్షతిరేకాలు వ్యక్తమవు తున్నాయి.
పూర్తయిన ఏర్పాట్లు
ఈ-మార్కెట్ విధానం కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన తిరుమగిరి మార్కెట్‌కు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.30 లక్షల నిధులను కేటాయించింది. ఈ నిధులతో మార్కెట్‌లో ప్రత్యేకమైన కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో 10 ఆత్యధునీక కంప్యూటర్‌లను ఏర్పాటుచేసి 400 ఎంబిపిఎస్ వేగం కలిగిన ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను లోడ్‌చేసి రైతులు, ట్రేడర్‌ల వివరాలను పోందుపర్చారు. ఈ విధానం పనితీరుపై ఇప్పటికే పరిశీలన జరిపారు. అంతేకాకుండా మ్యాచర్ మిషన్‌లు, వేయింగ్ మిషన్‌లు, హ్యాండ్‌హెల్డ్ మిషన్‌లను సిద్ధం చేశారు. ఈ-మార్కెట్ విధానాన్ని అమలు చేసేందుకు జాతీయ వ్యవసాయ మార్కెట్ (నామ్)కు చెందిన ముగ్గురు అధికారులను ఇక్కడ నియమించారు. స్ధానిక మార్కెట్ సిబ్బందిని సహయకులుగా నియమించారు. ఈనెల 14న ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నందున అందుకోసం ఏర్పాట్లు చేపడుతున్నారు.