తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 22: ప్రభుత్వ ఆసుపత్రులపై అపోహలు తొలగించి, ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంచడానికి పూర్తి స్థాయిలో తీర్చిదిద్ది మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. మంగళవారం సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రిలో ఐసియు, లేబర్ రూమ్, డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ విభాగాలు ప్రారంభోత్సవం, నర్సింగ్ కళాశాల, మాతా శిశు సంరక్షణ కేంద్రాలకు ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌తో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత పాలకులు ప్రభు త్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేయడం వల్ల వీటిపై ప్రజలకు నమ్మకం పోయిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణ ఏర్పడే దిశలో దేశంలో ఎక్కడా లేనంతగా అభివృద్ధి జరుగుతోందని, ఇందులో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత నిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య శాఖను తీర్చిదిద్ది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశంలో ప్రథమంగా నిలిచాయన్నారు. పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడానికి రాష్ట్రంలో 20 ఐసియు యూనిట్లు, 40 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టామని అన్నారు. ఒక విజన్‌తో మంచి ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని, మిషన్ భగీరథ వల్ల స్వచ్ఛమైన నదీ జలాల నీరు లభించి రోగాలు దరి చేరవన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే బంగారు ఆరోగ్య తెలంగాణ వస్తుందన్నారు.
అన్ని జిల్లాల్లో ‘తెలంగాణ జన జౌషధ కేంద్రాలు’ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మొదటగా ఏర్పాటు చేస్తామన్నారు. పేద ప్రజలు ఆసుపత్రికి వస్తే ఈ పరీక్షలకు బయటకు పంపకుండా ఇక్కడే నిర్వహించేలా ‘డయాగ్నస్టిక్ కేంద్రాలు’, ‘ఎక్స్‌రే యూనిట్లు’ కూడా ఏర్పాటు చేయనున్నామని, ముందుగా తమ మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి కేంద్రం ఏర్పాటు చేసి, రెండో కేంద్రం సిరిసిల్లలో నెలకొల్పుతామన్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేబొరేటరీలు, ఎక్విప్‌మెంటు, ఫర్నిచర్ తదితర వసతులు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పి.కృష్ణమూర్తి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్, సెస్ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, ఎంపిపి జూపెల్లి శ్రీలత, ఎఎంసి చైర్మన్ జిందం చక్రపాణి, స్ర్తి శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్ గుగులోతు రేణ, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ దార్నం లక్ష్మినారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఆర్.రమేశ్, ప్రాంతీయ ఆసుపత్రి పర్యవేక్షకులు డా.తిరుపతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్యలు పాల్గొన్నారు.