తెలంగాణ

‘ఖని’ ఖాతాలో మరో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఆగస్టు 22: విప్లవ పోరాటాలకు పుట్టినిల్లుగా పేరున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం కళల కాణాచిగా వర్ధిల్లుతూ రోజురోజుకూ రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా జాతీయ సమైక్యతను పెం పొందించే జెండా ప్రదర్శనలు... జాతీయ భావాలను ఇనుమడింపజేసే నృత్య ప్రదర్శనలు... సంస్కృతికి అద్దం పట్టే జానపద నృత్య ప్రదర్శనలు చేస్తూ... అంతర్జాతీయ స్థాయిలో మెప్పును పొందుతున్నారు. మొన్న పోలీస్ కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ ప్రపంచంలోనే అతి పొడవైన జాతీయ జెండా ప్రదర్శన చేపట్టగా... నిన్న పంద్రాగస్ట్ వేడుకలను పురస్కరించుకొని 3 వేల మంది విద్యార్థులచే ఫ్లాష్‌మాబ్ ప్రదర్శన చేయగా... నేడు ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని 100మంది కళాకారులు 100 నిమిషాలు నిర్విరామంగా సంస్కృతికి అద్దం పట్టే జానపద నృత్య ప్రదర్శనలు చేసి గోదావరిఖని ఖాతాలో మరో ప్రపంచ రికార్డును చేర్చా రు. టిఆర్‌ఎస్ రాష్ట్ర నేత కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని పట్టణంలోని ఆర్‌కె గార్డెన్‌లో ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా 100 మంది కళాకారులు... 100 నిమిషాలు జానపద నృత్యాలు చేశారు. దీనికి అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డును దక్కించుకున్నారు. తెలంగాణ జాన పద ఉత్సవ్ పేరుతో కోరుకంటి చందర్ నిర్వహించిన నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డు కో-ఆర్డినేటర్ జ్యోతి సమక్షంలో రెండున్నర గంటల పాటు కళాకారులు గుస్సాడి, లంబాడి, కోలాటం, చిరుతల, బోనా ల ఆట పాట, డప్పు, జాన పద నృత్యాలు చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. అనంతరం జాన పద ఉత్సవ్ నిర్వాహకులు కోరుకంటి చందర్‌కు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రశం సాపత్రం, బంగారు పతకాన్ని రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, వండర్ బుక్ కో-ఆర్డినేటర్ జ్యోతి అందజేశారు.

చిత్రం..ప్రపంచ వండర్ బుక్ ఆఫ్ రికార్డును అందుకుంటున్న కోరుకంటి చందర్