తెలంగాణ

సాగర్ విజయవిహార్‌కు 53 ఏళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఏప్రిల్ 9: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ గుర్తుకురాగానే ఎవరైనా గుర్తుకు వచ్చేది విజయవిహార్ సాగర్‌లో విజయవిహార్ ప్రారంభమై శనివారం నాటికి 53 సంవత్సరాలు పూర్తిచేసుకుని 54 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సాగర్ డ్యాం నిర్మాణ సమయంలో సాగర్ నిర్మాణాన్ని సందర్శించడానికి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులతోపాటు వివిద దేశాధ్యక్షులు వచ్చిన కారణంగా వారికి వసతి ఏర్పాటు కోసం అన్ని హంగులతో ఉన్న గెస్ట్‌హౌస్ ఒకటి అవసరమైంది. దీంతో చారిత్రక ప్రసిద్ధి అయిన విజయపురి పేరుమీదుగా విజయవిహార్ ప్రారంభమైంది. 1963 ఏప్రిల్ 10న అప్పటి ఏపి సీఎం సంజీవరెడ్డి దీన్ని ప్రారంభించారు. అప్పటినుండి దేశ ప్రధానులు, ఉప ప్రధానులు, ముఖ్యమంత్రి, గవర్నర్‌తోపాటు జపాన్, శ్రీలంక, భూటాన్ దేశ అధ్యక్షులకు సైతం ఈ విజయవిహార్ వసతి ఇచ్చింది. మొదటి ఇరిగేషన్ ఆధీనం లో ఉన్న విజయవిహార్ కొద్దికాలంలోనే టూరిజం ఆధీనంలోకి వెళ్ళిన తరువాత విజయవిహార్‌కు అనుబంధంగా సమాగమం, సరోవర్ మరో రెండు వసతిగృహాలను ఏర్పాటుచేసుకోని సాగర్‌కు వచ్చే సందర్శకులకు పూర్తి సౌకర్యవంతంగా వసతి ఏర్పాటు చేసుకుంది.