తెలంగాణ

మా ప్రజంటేషన్‌తో కెసిఆర్‌కు జవాబిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: నీటి పారుదల రంగంపై ఇటీవల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చెప్పిన అబద్ధాలన్నింటికీ తాము ఇవ్వబోయే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సరైన జవాబు ఇస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు దీటుగా కాంగ్రెస్ ఇవ్వాలనుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి? ఏయే అంశాలను ప్రధానంగా తీసుకోవాలి తదితర అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగాతెలంగాణలో అవినీతి జరుగుతున్నదని, అభివృద్ధి కార్యక్రమాలు కాదు అక్రమాలే కనిపిస్తున్నాయని విమర్శించారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు కుట్ర జరుగుతున్నదని ఆయన విమర్శించారు. వీటన్నింటికీ తాము త్వరలో ఇవ్వబోయే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సరైన జవాబు చెబుతామని అన్నారు. ఈ సమావేశంలో పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎంపి నంది ఎల్లయ్య, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ జె. గీతారెడ్డి, ఎమ్మెల్యేలు డికె అరుణ, టి. జీవన్‌రెడ్డి, వంశీచంద్ రెడ్డి, డి. శ్రీ్ధర్ బాబు, సునీతా లక్ష్మారెడ్డి, శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.
12న అంబేద్కర్ జయంతి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతిని ఈ నెల 12న సికింద్రాబాద్‌లోని ఇంపిరియల్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన చెప్పారు. ఇలాఉండగా ఎన్‌ఎస్‌యుఐ 46వ అవిర్భావ దినోత్సవం గాంధీ భవన్‌లో ఘనంగా జరిగింది. ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఇ. వెంకట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.