తెలంగాణ

ప్రస్తుతానికి సర్దుబాటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులకు ఎక్కవ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో తెరాస సర్కారు ఏర్పడి 22 నెలలు గడుస్తున్నప్పటికీ, ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి రాజయ్యను తొలగించి కడియం శ్రీహరిని నియమించడం వినా మంత్రివర్గంలో ఎలాంటి మార్పు చేర్పులూ చేపట్టలేదు. మరో ఏడాది వరకు కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయ. అయితే శాఖలను సర్దుబాటు చేయాలని సిఎం భావిస్తున్నట్టు తెలిసింది. కొంతమంది మంత్రుల వద్ద కీలకమైన శాఖలు ఎక్కువగా ఉండగా, కొంతమంది వద్ద తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సిఎం వద్దనున్న కొన్ని శాఖలను సైతం మంత్రులకు కేటాయించనున్నారు. గతంలో సంక్షేమ శాఖలన్నింటిని కెసిఆర్ తనవద్దే ఉంచుకున్నారు. అనంతరం ఎస్సీ సంక్షేమ శాఖను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి కేటాయించారు. మొత్తం మంత్రివర్గ సభ్యుల సంఖ్య 18 కాగా, ప్రధానమైన శాఖలు 44 ఉన్నాయి. దీంతో ఒక్కో మంత్రికి రెండునుంచి మూడు శాఖల కేటాయింపు అనివార్యమైంది. మంత్రివర్గం రెండేళ్ల పనితీరును బేరీజు వేసుకొని ఏయే శాఖలు ఎవరికి కేటాయిస్తే బాగుంటుందనే ఆలోచన జరుగుతోందని, మరో మూడు వారాల్లో శాఖల కేటాయింపులు, మార్పు చేర్పులు ఉంటాయని తెరాస వర్గాలు చెబుతున్నాయ. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలే తప్ప సిఎం దృష్టి సారించలేదని మరికొన్ని వర్గాలు అంటున్నాయి. మూడేళ్లు గడిచిన తరువాత వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయి కానీ, ఇప్పట్లో ఎలాంటి మార్పులూ ఉండవని అంటున్నారు. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం కుదురుకోవడానికే కొంత సమయం

పడుతుందని, అధికారుల కేటాయింపు వంటి వాటికి చాలా ఆలస్యం జరిగిందని, అందువల్ల మంత్రుల పనితీరుపై విమర్శలకు అవకాశం లేదని అంటున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న పథకాలకు సంబంధించి మంత్రుల పనితీరు బాగానే ఉన్నందున కేబినెట్‌లో తక్షణమే మార్పులు చేయాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి అధినేత వచ్చినట్టు చెబుతున్నారు.
మరోవైపు నామినేటెడ్ పదవుల పంపకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది కాలంగా స్వయంగా సిఎం అనేక సందర్భాల్లో నామినేటెడ్ పదవుల పంపకం జరపనున్నట్టు ప్రకటించినా అమలు కాలేదు. గత ప్లీనరీలో నామినేటెడ్ పదవుల పంపకంపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారని ప్రకటించినా పదవుల పంపకం జరగలేదు. తిరిగి మళ్లీ ప్లీనరీ వస్తోంది. ఈ ప్లీనరీ నాటికైనా పదవుల పంపకం ఒక కొలిక్కి వస్తుందని పార్టీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు. అయితే తక్షణం మార్కెట్ కమిటీ పాలక వర్గాల నియామకం తప్ప ఇతర పదవుల పంపకానికి ఇంకా సమయం పట్టవచ్చునని తెరాస వర్గాలు తెలిపాయి. పదవుల సంఖ్య తక్కువగా ఉండటం, పదవులు ఆశిస్తున్న నాయకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో ఈ అంశంలో అధినేత ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.