తెలంగాణ

రాష్ట్రంలో కరవు విలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణలో కరవు విలయతాండవం చేస్తోందని రాష్ట్ర బిజెపి నాయకులు గవర్నర్ ఇఎస్‌ఎల్.నరసింహన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర బిజెపి నూతన అధ్యక్షునిగా నియమితులైన డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్. ఇంద్రసేనారెడ్డి తదితరులు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల తమ పార్టీకి చెందిన కరవు బృందాలు జిల్లాల్లో పర్యటించి కరవు వివరాలను సేకరించాయని, వాటిని క్రోడీకరించి గవర్నర్‌కు నివేదిక సమర్పించామని తెలిపారు. కరవుతో ప్రజలు, ముఖ్యంగా రైతులు, వలస కూలీలు అల్లాడుతున్నారని, గ్రాసం లేక పశువులు మరణిస్తున్నాయని వివరించారు. దుర్భిక్ష పరిస్థితుల వలన రైతులు కూలీలుగా మారుతూ పట్టణాలకు వలస వెళుతున్నారని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం మంచి నీటి సౌకర్యాన్ని కూడా కల్పించడం లేదని, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై మంత్రులు సమీక్ష జరపడం లేదని ఆయన విమర్శించారు.