తెలంగాణ

తారకరత్నకు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: హైదరాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించారు. సోమవారం జూబ్లీహిల్స్ వద్ద తనిఖీలు నిర్వహించి నిబంధనలను పాటించని పలు వాహనాలను గుర్తించారు. సినీ నటుడు తారకరత్న కారు అద్దాలకు నల్లటి ఫిల్మ్‌లు ఉండటంతో దానిని పట్టుకుని 700 రూపాయల జరిమానా విధించారు. అదే మార్గంలో వెళ్తున్న విజయవాడ డిప్యూటీ కలెక్టర్‌కు కూడా పోలీసులు రూ.700 జరిమానా విధించి ఆ కారుకు ఉన్న నల్ల ఫిల్మ్‌లను తొలగించారు. చేసేదేమీలేక వారు ట్రాఫిక్ పోలీసులకు జరిమానా చెల్లించారు. మరో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా పోలీసులు ఐదు రోజుల క్రితం రూ.700 జరిమానా విధించడంతో పాటు ఆయన కారుకు ఉన్న నల్ల ఫిల్మ్‌లను తొలగించిన విషయం విదితమే.