తెలంగాణ

సాగర్ ఎడమ కాల్వలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, ఏప్రిల్ 11: నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో సరదాగా ఈతకు వెళ్లిన ఐదుగురిలో ఇద్దరు యువకులు సోమవారం మధ్యాహ్నం గల్లంతయ్యారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం షాబునగర్ వాడకు చెందిన స్నేహితులు ఐదుగురు ఎండి.అజహరుద్దీన్, ఎండి.జానిమియా, ఎండి.ఇస్మాయిల్, ఎండి. రియాజ్, ఎండి.లతీఫ్ ఈత కొడదామన్న సరదా తో సాగర్ ఎడమ కాల్వ వజీరాబాద్ మేజర్ తూ ము వద్ద ఈత కొడుతున్నారు. అకస్మాతుగా అజహర్, జానిమియా, ఇస్మాయిల్ తూము సమీపం లో సుడిగుండంలా తిరుగుతున్న నీటిలో ఇరుక్కుపోయి బయటకు రాకపోగా, వారిలో అక్కడ ఉన్న కొంతమంది ఇస్మాయిల్‌ను కాపాడారు. ఐదుగురిలో ముగ్గురు కాల్వ కట్టపైకి రాగా, ఇద్దరు అజహర్ (28), జాని (30) కాల్వలోనే గల్లంతయ్యారు. వెంటనే బయటపడ్డ ముగ్గురు కుటుంబ సభ్యుల కు, పోలీసులకు తెలియజేయడంతో వెంటనే రూర ల్ పోలీసు ఎస్‌ఐ వి.సర్దార్‌నాయక్, ప్రొబేషనరీ ఎస్‌ఐ సతీష్ సంఘటన స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు కాల్వలోనైనా కొట్టుకునిపోయి ఉంటారని, లేకుంటే వజీరాబాద్ మేజర్ తూముల నైనా ఉంటారని అనుమానిస్తున్నారు. గల్లంతైన వారి కోసం బంధువులు, పోలీసులు కాల్వ వెంట గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.