రాష్ట్రీయం

తూనికలు, కొలతల శాఖ అధికారిపై ఏసిబి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: కర్నూలు తూనికలు, కొలతల శాఖ ఇన్స్‌పెక్టర్ నాగోతు స్వామి హైదరాబాద్‌లోని నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నట్టు గుర్తించారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని స్వామి నివాసంతోపాటు అతని బావమరిది ఇంట్లోను ఏసిబి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు రూ. 10 కోట్లు విలువైన ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్‌లో మూడు, మూడంతస్తుల భవనాలు, రెండు ఓపెన్ ప్లాట్లు, కొంత నగదుతోపాటు బంగారు ఆభరణాలు కనుగొన్నట్టు అధికారులు తెలిపారు. అదేవిధంగా విజయవాడలో ఓ భవనంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టు విచారణలో తేలినట్టు అధికారులు తెలిపారు. గతంలోనూ అధికారి నాగోతు స్వామి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడినట్టు వెల్లడించారు. గత జూలై 15న రూ. 30వేలు లంచం తీసుకుంటుండగా అతణ్ని పట్టుకున్నట్టు ఏసిబి అధికారులు తెలిపారు.