తెలంగాణ

యాదాద్రి తీరుగా భద్రాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: యాదాద్రి తరహాలో భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అదేశించారు. గోదావరి తీరాన బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ కారిడార్‌గా సమగ్రాభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. భద్రాచలం ఆలయాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై క్యాంపు కార్యాలయంలో బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఉన్నతాధికారులు, స్థపతి వల్లి నాయకం, ఆర్కిటెక్ట్‌ల ఆనంద్‌సాయి, రవి, మధుసూదన్ తదితరులతో సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఆలయ ప్రస్తుత పరిస్థితి, కళ్యాణ మంటపం, మాడ వీధులు, ప్రాకారం పరిసర ప్రాంతాలపై అధికారులు సిఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ ధర్మపురి, కాళేశ్వరం సహా గోదావరి నదీతీరాన బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ప్రముఖ ఆలయాలను సర్వతోముఖాభివృద్ది చేస్తామన్నారు. ప్రముఖ యాత్రా స్థలాలుగా పేరున్న ఆలయాల్లో భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడంతోపాటు ముఖ్యమైన ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ప్రాంగణాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భద్రాచలం ఆలయాన్ని అటు భక్తులకు, ఇటు దైవ సంబంధ కార్యక్రమాలకు అనువుగా నిర్మాణాలను తీర్చిదిద్దాలని సూచించారు. గోదావరి నది ఒడ్డున నిర్మించిన కరకట్ట, దేవాలయం మధ్యనున్న ప్రాంతమంతా పరిగణలోకి తీసుకోని కొత్త డిజైన్లు రూపొందించాలన్నారు. భక్తులు సులభంగా తిరిగే విధంగా విశాలమైన ప్రాంగణం ఉండాలని, శ్రీరామ నవమితోపాటు ముఖ్యమైన కార్యక్రమాలు జరిగేందుకు అనువుగా విశాలమైన కళ్యాణ మంటపం నిర్మించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆలయ గర్భగుడిని యథాతధంగా ఉంచుతూనే భక్తుల సౌకర్యార్థం మెరుగైన ఏర్పాట్లు చేయాలని, దీని కోసం ప్రణాళిక తయారు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాకారం సరిపోతుందా? మరొకటి నిర్మించాలా? అనే అంశంపై అధ్యయనం చేయాలన్నారు. దేవాలయం చుట్టూ ఉన్న రహదారులను మాడ వీధులుగా తీర్చిదిద్దే అంశాన్ని పరిశీలించాలన్నారు. మహాలక్ష్మి అండాళ్ అమ్మవార్ల దేవాలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. పర్ణశాల, చిత్రకూట మంటపం, జఠాయువు మంటపం తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. స్థపతి, ఆలయ నిర్మాణ రూపకర్తలు, ఆగమ శాస్త్ర పండితులు కలిసి చర్చించి చిన్న జీయర్ స్వామి సూచనలతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాల్సిందిగా సిఎం ఆదేశించారు. శ్రీరామ నవమి ఉత్సవాల తర్వాత తాను కూడా మరోసారి భద్రాచలం సందర్శించి అక్కడ చేయాల్సిన చేర్పులు మార్పులపై క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతానని చెప్పారు. యాదగిరిగుట్ట మాదిరిగానే భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని, విశాలమైన, అందమైన ఉద్యానవనాలు, అన్ని సౌకర్యాలతో కూడిన కాటేజీలను నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం... భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే అంశంపై అధికారులతో చర్చిస్తున్న సిఎం కెసిఆర్