తెలంగాణ

ఉస్మానియా ఘనం.. జెఎన్‌టియుహెచ్ ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ రాష్ట్రంలో మూడు విశ్వవిద్యాలయాలకు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నేక్) గ్రేడ్‌లు ప్రకటించింది. ఉస్మానియా యూనివర్శిటీకి అత్యున్నతమైన ఎ ప్లస్ గ్రేడ్ ఇవ్వగా, జెఎన్‌టియుహెచ్‌కు ఎ ప్లస్ గ్రేడ్‌తోనే సరిపుచ్చింది. అదే విధంగా కాకతీయ యూనివర్శిటీకి సైతం నేక్ కేవలం ఎ గ్రేడ్ మాత్రమే ఇచ్చింది. ఉస్మానియా యూనివర్శిటీకి సిజిపిఎ 3.52 రాగా, కాకతీయ యూనివర్శిటీకి, జెఎన్‌టియుహెచ్‌లకు మాత్రం 3.01 వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో తరగతి గది అడుగు తక్కువ ఉన్నా, లైబ్రరీల్లో ఒక్క జర్నల్ తక్కువగా ఉన్నా తరచి తరచి ప్రశ్నించే జెఎన్‌టియు హెచ్ మాత్రం వౌలిక సదుపాయాలను కల్పించుకోవడంలోనూ, పరిశోధనలు, బోధన రంగంలో తనకంటూ ప్రత్యేకతను నిరూపించుకోవడంలో విఫలం కావడంతో నేక్ ఎ ప్లస్ ప్లస్ గుర్తింపును సాధించలేకపోయింది. కాలేజీలను సంవత్సరం పొడవునా తనిఖీలు చేసి ప్రమాణాలను నిర్ధారించడంలో ఆరితేరిన జెఎన్‌టియు హెచ్ తన సొంత విషయం వచ్చేసరికి ఎ ప్లస్ ప్లస్ కాకపోయినా, కనీసం ఎ ప్లస్ గ్రేడింగ్‌ను సైతం సాధించలేకపోవడంతో అందర్నీ నిరాశ పరిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అగ్రస్థానంలో ఉన్న జెఎన్‌టియు నేడు ఉస్మానియా యూనివర్శిటీ సాధించిన గ్రేడింగ్‌ను సైతం పొందలేకపోవడంపై విమర్శలు వినవస్తున్నాయి.
ఇంజనీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ కాలేజీలకు గుర్తింపు ఇవ్వడంలో జెఎన్‌టియుహెచ్ అనుసరిస్తున్న విధానం అనేక లోపాలతో కూడి ఉండటం , సదుపాయాలున్న కాలేజీలను ముప్పుతిప్పలు పెట్టి, సదుపాయాలు లేని కాలేజీలకు సైతం గుర్తింపు జారీ చేయడం ద్వారా ఇప్పటికే జెఎన్‌టియు విమర్శలను ఎదుర్కొంటోంది. ఇదేమిటని అడిగితే రికార్టులు పరంగా తాము పరిశీలిస్తామని జెఎన్‌టియు పెద్దలు వ్యాఖ్యానించడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇటీవల ఉస్మానియా యూనివర్శిటీలో వౌలిక సదుపాయాలు, సాంకేతిక పరికరాల కల్పనలో గణనీయమైన పురోగతి ఉండటం, సిబ్బంది కూడా న్యాక్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో సంతృప్తి చెందిన న్యాక్ బృందం ఉస్మానియా యూనివర్శిటీకి ఎ ప్లస్ గుర్తింపు ఇచ్చిందని ఉస్మానియా యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఐక్యూఎసి డైరక్టెర్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, ఒయు రిజిస్ట్రార్ సిహెచ్ గోపాలరెడ్డిలను, నేక్ బృందం పరిశీలన సమయంలో సహకరించిన బోధన, బోధనేతర సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రపంచంలో వెయ్యి వర్శిటీలను గుర్తించగా అందులో 30 భారతీయ వర్శిటీలు ఉన్నాయని, ఉస్మానియా కూడా అందులో చోటు సాధించడం అభినందనీయమని విసి పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు విశ్వవిద్యాలయాలు న్యాక్ గుర్తింపు పొందడంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆయా వైస్ ఛాన్సలర్లకు అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది ఈ గ్రేడింగ్ మరింత పెరిగేలా కృషి చేయాలని ఆయన యూనివర్ళిటీలకు సూచించారు.