తెలంగాణ

బైసన్ పోలో గ్రౌండ్‌పై విహెచ్ ప్రజాభిప్రాయ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో గ్రౌండ్‌కు ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని తరలించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు అభిప్రాయ సేకరణ చేపట్టారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్ బోయిన్‌పల్లి, తాడ్‌బండ్ తదితర ప్రాంతాల్లో పర్యిటించారు. బైసన్ పోలో గ్రౌండ్‌కు సచివాలయాన్ని తరలించాలా? వద్దా? మీరు ఏమనుకుంటున్నారు?, ప్రస్తుత సచివాలయానే్న కొనసాగించాలా? అని స్థానికులను, ఆ మార్గాల్లో వాహనాల్లో వెళుతున్న వారిని ఆపి అడిగారు.
ఈ సందర్భంగా విహెచ్ మీడియాతో మాట్లాడుతూ కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలనను రాష్ట్ర బిజెపి నాయకులు విమర్శిస్తుంటారని, ఆ పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు పొగుడుతుంటారని ఆయన అన్నారు. కొత్త సచివాలయం నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నానని, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు.
నేరెళ్ళ బాధితులకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం ఆగదని అన్నారు. ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డితో ముఖ్యమంత్రి రాజీనామా చేయించాలనుకోవడం మంచిదేనని అయితే పార్టీ మారిన వారందరితో రాజీనామా చేయిస్తే బాగుంటుందని విహెచ్ అన్నారు.