తెలంగాణ

అక్షరాస్యత అమలుకు నిధులు మంజూరు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: వంద రోజుల్లో అక్షరాస్యత కార్యక్రమం అమలుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వయోజన కేంద్రాలను గ్రామ గ్రంథాలయాలుగా మార్చాలని, వయోజన విద్యా శాఖను బలోపేతం చేయాలని, గ్రామ కో-ఆర్డినేటర్ల వేతనం రూ. 10 వేలకు, మండల కో-ఆర్డినేటర్ల వేతనం రూ. 30 వేలకు పెంచాలని, సాక్షర భారత్ కో-ఆర్డినేటర్ల సర్వీసులను క్రమబద్ధీకరించి అవసరమైన చోట వారి సేవలను ఉపయోగించుకోవాలని, కొత్త జిల్లాల స్థాయిలో అక్షర కేంద్రాలను, మండల, జిల్లా కో-ఆర్డినేటర్ల వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో మీరు సానుకూలంగా స్పందించకపోతే సాక్షర భారత్ సిబ్బందితో కలిసి ప్రజాందోళనను చేపట్టడానికి వెనుకాడమని ఆయన పేర్కొన్నారు. విద్యా వికాసం లేని చోట సమాజ వికాసం జరగదని ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో 95 శాతం అక్షరాస్యతను సాధించి దే శంలోనే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామంటూ పథకాలు ప్రకటించారని ఆయన తెలిపారు. కానీ అక్షరాస్యతను అభివృద్ధి చేసే ప్రణాళిక అమలుకు నోచుకోలేదని, ఫలితంగా దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలీస్తే తెలంగాణ 32వ స్థానంలో ఉన్నదని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 584 మండలాల్లో 309 మండలాలలో అక్షరాస్యత కేవలం 55.50 శాతంగా మాత్రమే ఉందని, మరో 167 మండలాల్లో అక్షరాస్యత పరిస్థితి దీని కంటే తీసికట్టుగా ఉందని కేంద్రం గుర్తించిందని ఆయన వివరించారు.