తెలంగాణ

డెంగ్యూతో విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కెపిహెచ్‌బికాలనీ, సెప్టెంబర్ 14: డెంగ్యూ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఓ విద్యార్ధి మృతి చెందగా, మృతదేహాన్ని ఇంటి యజమాని ఇంట్లోకి తీసుకురానీయకుండా అడ్డుపడడంతో రాత్రి మొత్తం బారీ వర్షంలో మృతదేహం తడిసిపోయిన సంఘటన స్థానికులను కలిచివేసింది. మహబూబ్‌నగర్ మండలం వనపర్తి జిల్లా పెబ్బెరు ప్రాంతానికి చెందిన ఈశ్వరమ్మ గత నాలుగు సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి వెంకటేశ్వర్‌నగర్‌లో నివాసముంటుంది. వెంకటేశ్వరనగర్ ప్రాంతంలో నివసించే ఈశ్వరమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సురేష్(12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతుండగా రెండవ కుమారుడు దేవకుమార్(9) 4వ తరగతి చదువుతున్నాడు. కాగా గత రెండు రోజుల క్రితం సురేష్ జ్వరంతో బాదపడుతుండడంతో కొడుకును ఈశ్వరమ్మ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అయితే సురేష్‌కు డెంగ్యూ వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు నిర్దారించడంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి సురేష్ మృతి చెందాడు. దీంతో వెంకటేశ్వరనగర్‌లోని అద్దె ఇంటికి సురేష్ మృతదేహాన్ని తీసుకువచ్చారు. అయితే మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురావద్దంటూ ఇంటి యజమాని జగదీష్‌తో పాటు అతని కొడుకు వెంకటేష్ అడ్డుకున్నారు. దీంతో రాత్రంతా వర్షంలో మృతదేహంతో తల్లి తడుచుకుంటూ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. దీనికి చలించిపోయిన బస్తీ వాసులు చందాలు వేసుకొని దహన సంస్కారాలు నిర్వహించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకొని మానవత్వం లేని ఇంటి ఓనర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

చిత్రాలు.. కుమారుడి మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి ఈశ్వరమ్మ. సురేష్(ఫైల్‌ఫొటో)