తెలంగాణ

20వేల మందికి కాంగ్రెస్ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: రాష్ట్ర వ్యాప్తంగా 20వేల మంది కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈనెల 18నుంచి 22 వరకు హైదరాబాద్ మినహా పూర్వ తొమ్మిది జిల్లాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రోజుకు రెండు జిల్లాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 18న ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు కరీంనగర్‌లో, మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు సంగారెడ్డిలో శిక్షణ నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20వేల మందికి శిక్షణ నిర్వహించాలని నిర్ణయించారు. 19న ఆదిలాబాద్, నిజాబాద్‌లో, 20న మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో, 21న ఖమ్మం, నల్లగొండ జిల్లాలో శిక్షణ నిర్వహిస్తారు. 22న వరంగల్ జిల్లాలో శిక్షణ నిర్వహించిన అనంతరం సాయంత్రం భూపాలపల్లిలో సింగరేణి కార్మికుల బహిరంగ సభ నిర్వహిస్తారు. ప్రతి బూత్ నుంచి ఇద్దరు కార్యకర్తలు శిక్షణకు హాజరయ్యే విధంగా చూస్తున్నట్టు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రతి గ్రామం నుంచి ముగ్గురు సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన రెవెన్యూ రికార్డుల సవరణలు, భూ సర్వే, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం , కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే రైతు సంరక్షణ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ తెలిపింది. దీనికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని పుస్తకాల రూపంలో శిక్షకులకు అందజేస్తారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం, మూడు ఎకరాల భూమి కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు సేకరిస్తారని చెప్పారు.