తెలంగాణ

చట్టాలపై అవగాహన ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ప్రజలకు అవగాహన కల్పించకుండా చట్టాలను అమలు చేయడం వల్ల సత్ఫలితాలు ఇవ్వవని తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అభిప్రాయపడ్డారు. చట్టాల పట్ల సమాజానికి ఏ రకంగా అవగాహన కల్పించాలనే విషయంపై ప్రజా ప్రతినిధులు యోచించాలని స్పీకర్ అన్నారు. చట్టాల అమలులో కఠినంగా వ్యవహరించడం వల్ల బాలలపై జరిగే ఆఘాయిత్యాలను ఆపగలమన్నారు. కర్నాటక లెజిస్లేచర్స్ ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్‌పై కర్నాటక విధాన సభ ఆవరణలో గురువారం జరిగిన ‘బాలల హక్కుల అమలు’ అంశంపై దక్షిణాది రాష్ట్రాల నుంచి 80 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి స్పీకర్ సిరికొండ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి ప్రసంగిస్తూ, దేశంలో చాలా సమస్యల వల్ల బాలల సమస్యలను విస్మరించడం వల్ల దయనీయమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. చట్టాలపై సరైన ప్రచారం లేకపోవడం, సరిగ్గా అమలు కాకపోవడం వల్ల బాలల హక్కులను విస్మరించారన్నారు. బాలల శక్తి, యుక్తులను సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్ తరాలకు చాలా నష్టం వాటిల్లుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాలల హక్కుల అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తల్లి, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రత్యేక పథకాన్ని తమ రాష్ట్రం అమలు చేస్తుందన్నారు. కెసిఆర్ కిట్ పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయన్నారు. మండలి చైర్మన్ స్వామిగౌఢ్ మాట్లాడుతూ, ఆడపిల్ల పుట్టగానే చంపేయడం వంటి అనాగరిక చర్యలు బాధకరమన్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాల అవసరం ఉందన్నారు. చట్టాల అమలులో కఠినంగా వ్యవహరించడం వల్ల బాలలపై జరిగే ఆఘాయిత్యాలు ఆగుతాయన్నారు. తమ రాష్ట్రంలో కూడా బాలల హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సదస్సుకు రాష్ట్రం నుంచి హాజరైన వారిలో ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, వివేకానందా తదితరులు ఉన్నారు.